నా పాకశాస్త్ర ప్రావీణ్యం!!!

సాధారణం

మొన్నటి నుండి అనుకుంటున్నా ఏ విషయం పై టపా రాద్దామా అని…

దేని గురించైనా అనుకుని మొదలు పెట్టడం విషయం సరిగ్గా కుదరకో, రాసింది నాకే నచ్చకో ఏమిటో ఏది సరిగ్గా కుదరడం లేదు అని అనుకుంటూ ఉన్నాను…

ఇంతలో మా అత్తయ్యగారు ఊరు వెళ్ళారు…అత్తగారు ఊరెళ్ళిపోతే కిచెన్ బాధ్యత అంతా  నాదే… అంటే మామూలప్పుడు కాదా అని మీకో డౌట్ రావచ్చు…తనున్నప్పుడు చక్కగా తనే వంట చేసి నాకు డబ్బా కట్టిస్తారన్నమాట ఆఫిస్ కి తీసుకెళ్ళను……మరి నువ్వేమి చేస్తావంటారా?మనం కూరగాయల కటింగ్..ఇంకేమైనా పనులు ఉంటే అవన్నమాట….

తను ఊరెళ్ళినప్పుడు కిచెన్ కి మకుటం లేని మహా రాణినన్నమాట.నా కిచెన్ ఒక ప్రయోగశాల … ఆహా ఇది  వినడానికి ఎంత బాగుంది…కానీ తను లేకపోతే ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ లో కూర్చుని క్లాసులు విన్నట్లు  ఉంటుంది  నా పరిస్థితి..పొద్దుననుంచి సాయంత్రం వరకు ఏకబిగిన క్లాసులు చెప్పినట్లు  హడావిడిగా లేసి కూరలు తరుక్కుని,వంట చేసుకుని,డబ్బా కట్టుకుని,ఉరుకుల పరుగులతో వచ్చి ఆఫిస్ బసెక్కడం,ఇంటికొచ్చాక పక్క రోజుకి కూరలు కట్ చేసుకోవడం ,అంతా క్లీన్ చేసుకోవడం..అబ్బబ్బా ఎంత పనో…

తను ఉంటే ఎంచక్కా రెగులర్ ట్రైనింగ్ లో చేరినట్లు ఉంటుంది…ఆడుతూ పాడుతూ పని చేస్తున్నట్లు ఉంటుంది నాకు…:)

ప్రస్తుతానికి నేను ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ లో ఉన్నాను అన్నమాట…నిన్న లేచి నిద్ర మొహం వేసుకుని టైం అయ్యిపోతుందని తిట్టుకుంటూ ఒక సైడ్ కూర చేస్తూ ఇంకో సైడ్ గరిటె పట్టుకుని సాంబార్ తిప్పుతున్నాను…దానితో రింగుల రింగులగా తిరుగుతున్న సాంబార్ తో పాటు నేనూ చిన్న ఫ్లాష్ బాక్ లో కి వెళ్ళొచ్చా…

చిన్నపటినుంచి వంట అన్నా వంటిల్లు అన్నా ఆమడ దూరం పరిగెత్తే దాన్ని…తినడానికి మాత్రమే వంటిల్లు గడప తొక్కేదాన్ని…అమ్మేమో అప్పుడప్పుడు వంట నేర్చుకోవే పనికివస్తుంది…రా దోశెలు వేయడం నేర్పుతానని పోరగా పోరగా వన్ ఫైన్ డే సరే చెప్పుకో అని చెప్పా…

తనేసిన దోసేలేమో చక్కగా గుండ్రంగా,మెత్తగా వస్తున్నాయి..నేనెసిందేమో ఒకటి ఆఫ్రికా షేప్లో,ఇంకొకటి ఆంటార్టికా షేప్ లో..ఇలా మాప్ లో ఏ షేపులు ఉంటాయో అయా షేపుల్లో వచ్చాయి…అవీ కాక అట్ట ముక్కల్లా తయారయ్యాయి..తల్లీ నీ దోశెలకో  దండం ,నీకో దండం నన్ను వదిలెయ్యి..అని చెప్పి ఇంకో సారి వంటిల్లు గడప తొక్కలేదు…

ఇంకో రెండు సార్లు ప్రయత్నించినా అదే తంతు..దాంతో వంట చాలా కష్టమైన సబ్జెక్ట్ అనీ  మాథ్స్ కన్నా కష్టమైనదని  డిసైడ్ అయ్యా…

ఈ సారి నానమ్మేమో అలా కాదురా వంట నేర్చుకోవడం చాలా ఈజీ…నీకు బాగా పనికివస్తుంది అని నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించింది.ఎలా?? హౌ?  అని అడిగా ..వంట వచ్చిందంటే నీకేమి కావాలంటే నువ్వు అది చేసుకుని తినొచ్చు…ఇది నేను చేసానని గర్వంగా చెప్పొచ్చు అని అన్నది..నాకేం కావాలో మీరున్నారు కదా చేయడానికి…నేను నేర్చుకోను పో..అని చెప్పేసా…నీ కర్మ పోవే అని నాన్నమ్మ కూడా కసిరింది…

సరే వన్ డే ఈ వంటా వంటా  అంటున్నారు…దోశెలు అవీ కాక వీజీ గా ఇంకెవైనా  పనులుంటే దాంతో  మనం వంట  నేరుచుకునే కార్యక్రమాన్ని మొదలు పెడదాము అని అనుకున్నాను…ఓ రెండు రోజులు పరీశీలించగా కటింగ్ అన్నింటి కంటె వీజీ అని అర్ధమయ్యింది..కాకపొతే కత్తితో జాగ్రత్తగా డీల్ చేయాలని అర్ధమయ్యింది…

సరే అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నేను కూరగాయలు కట్ చేస్తా …నాకివ్వవా అని అడిగా…అలాగేనంటూ కొన్ని కూరగాయలు,కత్తి అన్నీ ఇచ్చింది..అవీ కట్ చేయడానికేమో ఓ అరగంట పట్టింది…ఇలా లేట్ చేస్తే కుదరదు..అవతల నాకు స్కూల్ కి టైమవుతోంది…ఇంకేప్పుడైనా కట్ చేస్తూలే అని అంది…

అమ్మో ఈ కటింగ్ కూడా కష్టమైన పని గా ఉంది….కొన్ని రోజులు ఈ వంట కి, వంటిల్లు కి దూరం గా ఉండడం బెటర్ అని ఘాఠిగా తీర్మానించుకుని మా రాక్షసి కి చెప్పా..(మా చెల్లెలికి)..నాకు తెలియకుండా వంట నేర్చుకోవడానికి వెళ్ళావో వీపు విమానం మోత మోగిస్తా అని…

అలాగే  అలాగే అంటూ బుద్దిగా తలూపి నాకు తెలియకుండా ఎప్పుడు నేర్చుకుందో చక్కగా దోశెలు వెయ్యడం,అన్నం వండడం,కూరలు చేయడం అన్నీ నేర్చేసుకుంది…తనని చూసి అమ్మ,నానమ్మ చూడవే నీకంటే చిన్నది,ఎంత బాగా చేస్తోందో చూడు…అని పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసారు…దానితో నాకు పౌరుషం వచ్చి నేను నేర్చుకుంటాను చూడండి అని కష్టపడి నేర్చేసుకున్నా…ముందుకన్నా ఇప్పుడు నయమన్నమాట…

అలా అలా అరకొర ఙ్ఞానం తో (అదే వంటలో)  ఇంటర్ కి వచ్చా…అక్కడ కొంత మంది ఉత్తమ పుత్రికలు పరిచయం అయ్యారు..అంటే వీళ్ళు చదువుతో పాటు ,ఇంట్లో పనులన్నీ చేసి,వంట కూడా నేర్చుకుంటారన్నమాట…వాళ్ళెప్పుడు ఖాళీ టైం దొరికినా వాళ్ళకొచ్చిన వంటల గురించి చెప్పేవారు…మనకేమో ఏది తెలియకపాయే…అక్కడేమో బిక్క మొహం వేసుకుని కూర్చునే దాన్ని…ఇంకో సారి ఇలాగే సెషన్ మొదలెడితే అక్కడ నుంచి నేను జంప్…

తరువాత ఇంజీనీరింగ్ లో నా లాగే ఉండే  బాచ్ ఒకటి తగిలింది..హమ్మయ్య అని అనుకున్నాను.సెమిస్టర్ల పరీక్షలు,అసైన్మెంట్లు ఈ గోలలో పడి  వంట మరియు వంటిల్లు జోలికి వెళ్ళడం మానేసా..ఇంక ఉద్యోగం వచ్చాకా పొద్దున్న ,రాత్రీ భోజనాలు పెట్టే హాస్టల్లో జాయిన్ అయ్యా…అక్కడా నేర్చుకునే ఛాన్స్ రాలేదు…అమ్మ ఇప్పటికైనా సెలవుల్లో వచ్చి నేర్చుకోవే  అని పోరుపెడుతోంది..మా రాక్షసేమో వంటల్లో నిష్ణాతురాలయ్యిపోయింది…

ఓ రోజు వచ్చి సీరియస్ గా ఇప్పటికైనా నేర్చుకోవే రెపు పెళ్ళయ్యి అత్తారింటికి వెళితే నిన్ను అనరు నన్నంటారు ఏమి సరిగ్గా నేర్పలేదని…అని  అంది..నేనెమో “Don’t Worry Mom,కాలం మారింది..నేను వంటొచ్చిన అబ్బాయ్యినే చేసుకుంటా “ అని చెప్పా…దీనితో అమ్మ ఈ జన్మలో నిన్నెవడూ బాగు చేయలేడు అని తిట్టుకుంటూ వెళ్ళింది…

పెళ్ళి కుదిరాక ఓ రెండు రోజులు కష్టపడి బేసిక్స్ నేర్చుకున్నా…తరువాత అత్తయ్యగారు చేయడం వల్ల నేను చేయలేకపోయా…కాని తను చేసేటప్పుడు పక్కనే ఉండి అన్నీ నోట్ చేసుకుంటూ వచ్చా..

ఓ రోజు తను ఊర్లో లేరు.. వంట చేసే మహత్తర బాధ్యత నా మీద పడింది .మా వారినేమో బయట నుంచి భోజనం తెచ్చెయ్యమంటే నో వే.ఈరోజు నువ్వు వంట చెయ్యాల్సిందే అని చెప్పి ఆఫిస్ కి వెళ్ళిపోయారు. …నాకేమో థియరిటికల్ గా తెలుసు ,ప్రాక్టికల్ గా చేయలేదు…ఎలారా దేవుడా అనుకుని అమ్మకో ఫొన్ కొట్టి ఇలా ఇలా అని చెప్పా..అందుకే చెప్పింది ముందు నుంచీ నేర్చుకోవే అని నసిగి మళ్ళీ చెప్పింది.

ఆ తరువాత వంట మొదలుపెట్టా…తొమ్మిదింటికి మొదలెట్టింది పన్నెండింటి వరకు కొనసాగింది.మధ్యలో డౌట్లొస్తే ఇంకో రెండు సార్లు అమ్మకి ఫోన్ చేసి అడిగి మొత్తానికి పూర్తి చేసా…

తనొచ్చే టైంకి  పనంతా పూర్తి చేసి టేబుల్ పైన అన్ని సర్ది పెట్టా..తనొచ్చి భోంచేద్దామా అనడిగారు…నేనెమో సరే అని చెప్పి వడ్డించగా తిని  బానే ఉందిరా బాగా చేసావు అని అన్నారు…నాకొక్క నిమిషం అర్ధం కాలా..తిడుతున్నారా పొగడుతున్నారా అని..ఎందుకైనా మంచింది మనమూ ఓ ముద్ద తిని తరువాత చెప్దాము  అననుకుంటూ నోట్లో పెట్టుకోగానే ఆశ్చర్యం,అద్భుతం,ఏమిటీ ఈ విచిత్రం అన్న రీతిలో    ఫీలింగ్స్ కలిగాయి…నా వంట బానే ఉంది…హమ్మయ్య ఎట్టకేలకు వంట అంత కష్టం కాదు అని అనిపించింది..ఇంకో రెండు రోజులు చేసేప్పటికి బానే చేయడం వచ్చేసింది.

కాకపొతే నా ప్రాబ్లెం ఇడ్లీ,దోశెల పిండి రుబ్బుకోవడలో.వాటికి కొలతలు అవీ  ఎంతెయ్యాలో సరిగ్గా తెలియదు…అది కూడా నేర్చేసుకున్నాను…ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఆపద్భాంధవి ఉప్మా చేయడం కూడా వచ్చేసిందోచ్…

తరువాత మా చెల్లెలు ఇక్కడికి వచ్చినప్పుడు నా వంట తిని తెగ మెచ్చుకుంది…బాగా చేస్తున్నవక్కా అని మా అమ్మ దగ్గర కూడా నన్ను తెగ పొగిడేసింది…మా అత్తయ్యగారు కూడా బాగా చేస్తున్నావమ్మా అని అన్నారు…ఇంత మంది పొగిడేసరికి ఓ రోజంతా తొమ్మిదో నంబర్ మేఘంలో ఉన్నాను…:P

అలా మొత్తమ్మీద వంట నాకు రాదు,నేను చేయలేను అనే ఫోబియా నుంచి బయట  పడ్డానన్నమాట…

ఇది సాంబార్ అయ్యే సైకిల్ గాప్ లో గుర్తొచ్చిన ఫ్లాష్ బాక్…

త్వరలో మన కృష్ణ గారి “టల్లోస్” మరియు మంచు గారి “చుంబరస్కా” వంటకం లా నేనూ  పేటెంట్లు తెచ్చుకునే వంటకాలు నేర్చుకుని మీకు పరిచయం చేయాలని  ఆశీర్వదించండి…

టపా రాయడం లో పడి స్టవ్ మీద పెట్టిన పప్పు సంగతి (అదే అండి రేపటికి) మర్చిపోయా…నేను వెళ్ళి చూసొస్తా..అంతవరకు ఉంటానేం…..

P.S: కృష్ణ గారి మరియు మంచు గారి పేర్లను నా బ్లాగ్లో పెట్టాను…వారు ఏమి అనుకోరనే అనుకుంటున్నాను…

20 responses »

 1. అనుకోవటమా? అనుకోవటమున్నరా? స్నిగ్ధా! అసలే ఓకే ఊరు వాళ్లం. నా మాట విని నా వైపుకొచ్చేయండి.. రెంటికీ పేటెంట్ నాదే..

  మంచు వంటకం పేరు చుమ్బరస్కా కాదు. ‘మంచుమ్బరస్కా’ అదన్నమాట! 🙂
  బాగారాసారు. అభినందనలు.

  • అవునా కృష్ణ గారు అది మంచుంబర్స్కానా …నాకు తెలియదండి…:)
   ఐతే రెంటికీ పేటెంట్ మీదేనన్నమాట…మీరు ఊరు సెంటిమెంట్ తో పడగోట్టేస్తున్నారండీ..
   🙂

   • 4E బ్రదర్ ఏంటండీ అలా అనేసారు…నాకు భయమేస్తోంది…నన్నేదైనా అంటే మీరున్నారు కదా నాకు తోడు గా..అసలే మనం బ్లాగుల ద్వారా కజిన్స్ అయిపోతిమి…
    >>మొత్తానికి ఇడ్లీలకు దోశలకు కొలతలు అడిగి ఇంజనీర్ల పరువు గౌరవం నిలబెట్టారు స్నిగ్ధగారు.
    ఇది అల్టిమేటండీ…మరే కొలతల్లో తేడాలొస్తే ప్రళయాలు వచ్చేస్తాయండీ..

 2. ఖచ్చితంగా అనుకుంటారు… అసలే ‘చుంబరస్కా’ పై పేటెంటు నాదంటే నాదని శిఖరాగ్ర స్థాయిలో గొడవలౌతున్నాయి, మీరేమో అది మంచుగారిదే అనేసారు…..ఇహ ఎమౌతుందో, ఎటుపోతుందో పెరుమాళుకెఱుక 😀

  మొత్తానికి ఇడ్లీలకు దోశలకు కొలతలు అడిగి ఇంజనీర్ల పరువు గౌరవం నిలబెట్టారు స్నిగ్ధగారు.

 3. ఈ కామెంట్ ఎందుకో వేసాను.. కానీ వచ్చినట్టు లేదు..
  ***************
  అనుకోవటమా? అనుకోవటమున్నరా? స్నిగ్ధా! అసలే ఓకే ఊరు వాళ్లం. నా మాట విని నా వైపుకొచ్చేయండి.. రెంటికీ పేటెంట్ నాదే..

  మంచు వంటకం పేరు చుమ్బరస్కా కాదు. ‘మంచుమ్బరస్కా’ అదన్నమాట!
  బాగారాసారు. అభినందనలు.
  ***************

  నాగార్జునా! :))

 4. హ్హహ్హహ్హా!! భలే ఉన్నాయ్ స్నిగ్ధ మీ వంట కబుర్లు! మీరు నాలాగే అన్నమాట 😉 కాని ఇప్పుడు నేను మీలాగే పాకసాస్త్ర ప్రావీణ్యం సంపాదించేసాలేండీ!!

  క్రిష్ణగారు అస్సలు అనుకోరు 🙂 చాలా మంచివారు….ఇక మంచుగారు అందుకు భిన్నం! అయినా ఏమీ అనుకోరు…ఇంకా తన చుంబరస్కా వరల్డ్ ఫేమస్ అయిపోయిందని హాపిగా ఫీల్ అవుతూ ఇంకో చెంబురస్క క్రియేట్ చేసినా చెయ్యొచ్చు! ఎందుకైనా మంచిది మన జాగ్రత్తల్లో మనం ఉండాలి 😉

  • ఇందు గారు మీరు మీరు నా బ్లాగులో కామెంటారా…
   కామెంట్ బాక్స్ కే కళొచ్చిందండి..:)
   నా బ్లాగుని చూసి కామెంటినందుకు మీకు బోలెడు థాంకులు…మీరు కూడా అంతేనా..:)
   ఏమిటో అండి అందరు భయపిస్తున్నారు.. నాకు భయమేస్తోంది…

 5. హ హ 🙂 బాగుందండీ.. మొదటిసారే బాగా వండేశారంటే పుట్టుకతో వచ్చిన విద్య అనమాట.. ప్రత్యేకంగా నేర్చుకునే పనిలేకుండా.. ఇంకా ఆలశ్యమెందుకు కొత్త వంటకాలు కనిపెట్టేసి పేటెంట్ పట్టేయండి…

  • అయ్యో వేణు గారు మీరు నన్ను పొగిడేస్తున్నారు…నాకు అంత దృశ్యం లేదండి…ఆ రోజు నా టైం బాగుండి అలా కుదిరిపోయిందన్నమాట..:)
   త్వరలో పేటెంట్ వంటకం కనిపెట్టేస్తా…

 6. హెంత మాటన్నారు స్నిగ్ధగారు, అసలు మీ వైపువుండి కామెంటు రాయడవల్ల కదూ కృష్ణప్రియగారు వచ్చి మంచుగారిది మంచుమ్బర్కా అని చెప్పింది. ఇందుగారొచ్చి కృష్ణప్రియగారు మంచోరని, మంచుగారు అందుకు భిన్నం అని ( ఇదుగోండి ఇందుగారు, మంచుగారు ఈ విషయం గురించి మనం తర్వాత మాట్టాడుకుందామే ) చెప్పింది. మిమ్మల్ని మెచ్చుకున్నదీ.

  • నేనెక్కడ అన్నాను అండి…వారి బ్లాగులో చుంబరస్కా అని చూసినట్లు గుర్తు…అందుకే అది రాసా…దానికి ఇంకో పేరు ఉందని నాకు తెలియదండి…
   నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఈ గొడవల్లో…:P

   • స్నిగ్ధా..

    రెండు పాయింట్లు..
    ౧. ఇందు గారు కామెంట్ పెడితే మీ కామెంట్ బాక్స్ కి కళ వచ్చింది. కానీ మేమంతా పెడితే మీరెలాగ ఫీల్ అయ్యారో.. ఇంకో టపా వేసి తీరాలని సవినయం గా మనవి చేసుకుంటున్నాను.
    ౨. నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఈ గొడవల్లో…:P *********************** Too late! ఒకసారి వస్తే ఇది మాఫియా లాంటిది. వెనక్కి వెళ్లలేరు. :))

    Just kidding.. Have fun!..

   • కృష్ణ గారు,మీరు కామెంటినప్పుడు ఓ రెండు రోజులు తొమ్మిదో నంబర్ మేఘం లో ఉన్నాను…:)
    నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఈ గొడవల్లో…:P *********************** Too late! ఒకసారి వస్తే ఇది మాఫియా లాంటిది. వెనక్కి వెళ్లలేరు.>>వామ్మో మీరూ భయపెట్టేస్తున్నారండీ…

 7. కేవ్వ్వ్ !!
  డెవలపర్ స్థాయి నుండి అంచేలెంచలు గా మేనేజర్ స్తాయి వరకు ఎదిగిన శిష్యురాలి ఎదుగుదల చూసి ఆశీర్వదించుచూ
  మా కిచెన్ లో సాంబార్ లను ప్రవ హింపచేస్తున్నాను
  >>ఏమిటో అండి అందరు భయపిస్తున్నారు.. నాకు భయమేస్తోంది…
  ఎవరక్కడ మా శిష్యురాలిని భయపిస్తున్నదీ..కవిత పడుద్ది 🙂
  చాలా బావుంది ఈ పోస్ట్

  • గురువు గారు మీరు కామెంట్ పెట్టేసారా…మన వేణు గారు,4E గారు,కృష్ణ గారు ,ఇందు గారు పెట్టేసారు…మీరు ఇంకా పెట్టలేదేంటా అని అనుకుంటున్నాను…మీరు పెట్టెసారు..ఐతే నాకిసారి అప్ప్రైసల్లో రేటింగ్ బాగా ఇచ్చారన్నమ్మట…థాంకు సో మచ్…మా గురువు గారు ఉండగా నాకెందుకు ఇంక భయం..
   🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s