దీపావళి ముచ్చట్లు

సాధారణం

పండక్కి శుభాకాంక్షలు చెప్దామని మొన్నననగా టపా మొదలుపెట్టా.కానీ ఆఫిస్లో పనుల వల్ల వెంటనే పోస్ట్ చేయలేకపోయా…

దానికేమిటయ్యా కారణం అంటే..ఇదీ…

మా ఆఫిస్కేమో మంగళ వారం సెలవిచ్చారు.పండగేమో బుధవారమాయే…మా లీడ్ అందరినీ పిలిచి ఎప్పుడు తీసుకుందాము లీవు మంగళవారమా బుధవారమా అని అడిగారు…అందరూ వీకెండు,సోమవారం లీవు పెడితే ఓ లాంగ్ హాలిడే వస్తుందని మంగళవారం సెలవుకి వోటేసారు…పోనీ బుధవారం సెలవు పెడదామంటే ఆల్రెడి నేను లీవు తీసేసుకున్నాను.సరే త్వరగా వెళ్ళి సాయంకాలం త్వరగా వచ్చేద్దామని ఆఫిస్ కి వెళ్ళాను.చూస్తే జనాలెవ్వరూ (అంటే మా టీంలో) రాలేదు.వాళ్ళొచ్చేలోపు టపా రాసేద్దామని ప్రారంభించా…ఇంతలో పోలోమని అందరూ రావడం,మీటింగ్స్  గట్రాతో , ప్రాజెక్ట్ పనులతో ఆ రోజూ టపా పోస్ట్ చేయలేకపోయా….

సో చాలా చాలా ఆలశ్యంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.కాస్త ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు(రేపు నాగుల చవితని అత్తమ్మ చెప్పారు),చాలా చాలా ముందుగా కార్తిక పౌర్ణమి శుభాకాంక్షలు…(ఆంధ్ర రాష్ట్ర అవతరణోస్త్వం,కన్నడ రాజ్యోత్సవ  శుభాకాంక్షలూ చెప్దామని అనుకున్నాను…దీపావళి గురించి చెప్పేటప్పుడు దాని గురించి ఎందుకులే…అవతరణ దినోత్సవానికి  ఇంకో టపా వేద్దాంలే అని ఇప్పుడు చెప్పడం లేదు…):p

ఈ సెలవుల పుణ్యమా అని రెండు మూడు రోజులుగా ఆఫిస్ కి ,ఇంటికినూ అరగంటలో రీచ్ అవుతున్నాను.ఎప్పుడూ రద్దిగా ఉండే మా కాబ్ వెళ్ళే రూట్లోని రోడ్లు ఖాళీగా,విశాలంగా కనిపించింది.ఎక్కడెక్కడ ఏ ఏ షాపులున్నాయో అన్నీ కనిపించాయి.రోజూ ఆ రూట్లోనే వెళ్ళినా ఇన్ని రోజులు అసలు గమనించలేదు.

ఈ సెలవులయ్యాక ఇహ మళ్ళీ మాములే బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు…ఎప్పటికీ తీరుతాయో…హ్మ్మ్మ్మ్….

పోయిన సంవత్సరం కూడా టపాసులు కొనలేదు ఈ సారన్నా కొందామని వెళ్ళి మా వారినడిగా…

దానికి నో నో మనం టపాసులు కాల్చకూడదు..ఆల్రెడి కాలుష్యం ఎక్కువయ్యింది..మనం ఆ డబ్బుతో ఏ అనాధ శరణాయలం లో డొనేట్ చేద్దాము అని ఓ చిన్న క్లాస్ ఇచ్చారు…నో నో కనీసం రెండు కాకరొత్తుల పెట్టెలు,రెండు బురుసుల పాకెట్లైనా కొనాల్సిందే అని నేనూ ఓ క్లాస్ పీకి ఆఫిస్ కి వెళ్ళిపోయా.

కాబ్లో వెళ్తోంటే నేనూ,చిన్ని దీపావళి చేసుకునేది గుర్తొచ్చింది.మా నాన్నగారు వాళ్ళు చిన్నప్పుడు టపాసులు వాళ్ళే చేసుకునేవాళ్ళట.పోనీ మా అన్నయ్యలెమైనా నేర్పుతారనుకుంటే వాళ్ళూ టపాసులు కొనేవారు…టపాసులు మేమే తయారు చేసుకుని కాల్చే చాన్స్ మాకు రాలేదు…

పండగ మూడు రోజుల ముందు నుంచి టపాసులు కొనడానికి ఓ పేద్ద లిస్ట్ తయారు చేసి ముందు రొజు నాన్నకి ఇచ్చే వాళ్ళము.ఆ తెచ్చుకున్న దాన్ని నేనూ,చిన్ని సగం సగం పంచుకునేవాళ్ళము. ఒక సారి టపాసులు కాలుస్తుంటే చెయ్యి కాలింది.అప్పటి నుంచి ఢాం టపాసులు కాల్చాలంటే కొంచెం భయం…మొత్తానికి టపాసులన్నీ అయ్యాక…ఆఖరికి వాటికి ఇచ్చిన అట్ట పెట్టెలతో సహా కాల్చేసి దీపావళి ముగించేవాళ్ళము.

తర్వాతర్వాత కాల్చడం తగ్గింది.చెన్నై వెళ్ళాక ఏదో కాల్చాలని కొన్నే కొనేవాళ్ళము…చిన్ని ఇప్పుడు కాల్చడం తగ్గించేసింది…టపాసులు ఎండపెట్టుకోవడం,వాటిని పంచుకోవడం,ఎవరు ముందు వాళ్ళ కోటాను ముగిస్తారో అని చూడ్డం…అన్నీ ఎంత సరదాగా ఉండేదో…ఇలా ఆలోచిస్తుండగానే ఆఫిస్ వచ్చేసింది…

ఆ రోజే మా ఆఫిస్ లో అందరికీ మెయిల్ వచ్చింది..మాములుగా దీపవళికి ముందు టపాసులని డిస్కౌంట్ రేట్లలో ఇస్తున్నాము తీసుకొండి అని పంపుతారు…

అదేనేమో అనుకుని మెయిల్ ఒపెన్ చేస్తే…అది స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు మొక్కల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన మెయిల్.అరె ఇదేదో బాగుందే అని అనుకున్నాను.

పక్కరోజు చూస్తే మా కొలీగ్స్ అందరూ వెళ్ళి స్వీట్ల డబ్బాతో పాటు,మొక్కలు తెచ్చుకుని పెట్టుకుని ఉన్నారు వాళ్ళ సీట్ల దగ్గర ..అందులో క్రొటన్లూ,రోజా మొక్కలూ ఉన్నాయి..మనమూ చూద్దామని మా టీం మేటు లాకెళ్ళింది.

అక్కడ చూస్తే ఓ పేద్ద క్యూ ఉంది.మేమిద్దరమే లాస్టు ఆ క్యూలో..చివరాఖరికి స్వీట్ డబ్బా తీసేసుకున్నాము…మొక్కలేమిస్తారో అని చూస్తోంటే మా ఇద్దరికీ రోజా మొక్కలొచ్చాయి.:) మొక్కని తీసుకెళ్ళేందుకు వీలుగా దాన్ని ఓ జూట్ బాగులో పెట్టి ఇచ్చారు…

మొక్కలొద్దనుకున్న వాళ్ళని మాకిచ్చెయ్యండి అని వెళ్ళి రిక్వెస్ట్ చేసొచ్చాము..అలా నాకు రెండు మొక్కలొచ్చాయి…కానీ మొక్కలు తెచ్చుకున్నాక అనిపించింది ఈ సారి టపాసులకి పెట్టే డబ్బుతో ఇంకో నాలుగు మొక్కలు కొందామని….వచ్చే వారాంతం వెళ్ళి కొత్త మొక్కలు,వాటికి మట్టి,కుండీలు కొనాలని తీర్మానించా….

సో అలా ఈ సారి టపాసులు కొనలేదు….ఇల్లు మొత్తం చక్కగా దీపాలతో అలకరించాం లేండి…

మీరు టపాసులు కొనకపోతే ఏం మీ బదులు మేము కాలుస్తాము అని ఆ బాధ్యతని మా పక్కన ,వెనకింటి అపార్ట్మెంట్ల వాళ్ళు తీసుకున్నారు…

ఏడింటికి మొదలెట్టిన వాళ్ళు పదింటి వరకు కానిచ్చారు…టపాసుల శబ్దాలతో వీధి మోగిపోయింది.

అడగడం మర్చిపోయా అందరూ దీపావళి బాగా చేసుకున్నారా?

ఇవి ఈ సంవత్సరం దీపావళి పండగ ముచ్చట్లు….

ప్రకటనలు

11 responses »

  1. బావున్నాయి మీ పండగ సంబరాలు 🙂

    మీకు కూడా ఆలశ్యంగా దీపావళి శుభాకాంక్షలు, కాస్త ముందుగా ఆం.ప్ర అవతరణ (పన్లో పని కన్నడ రాజ్యోత్సవ) , ఇంకాస్త ముందుగా క్రిస్‌మస్, ఇంఇంకాస్త ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు 😀
    ద.హా

  2. స్నిగ్ధ,

    బాగుంది. కొన్ని దీపాలైతే పెట్టారు కదా.. అది చాలు.

    @ నాగార్జున,
    🙂 చాలా ముందుగా షష్టిపూర్తి శుభాకాంక్షలు కూడా చెప్పలేక పోయారా?

  3. ద.హా అనిన తెలియదా !! కడు విచారకరమైన విషయం స్నిగ్ధగారు…విచారకరం ః(
    బులుసుగారి అద్భుత ఆవిష్కరణలు ఈ ద.హా లు, అ.హాలు, చి.నలు….మన బ్లాగర్లు,బజ్జర్లు కలిసి ఆ పదకోశాన్ని అభివృద్ది చేశారు. ఇదో మీ కోసం ఇస్తున్నా పూర్తి చిట్టా

    చి.న = చిరునవ్వు
    మ.హా = మందహాసం
    ద.హా = దరహాసం
    అ.హా = అట్టహాసం
    వి.టా.హా = వికటాట్టహాసం
    బా.హా. = బాలయ్య హాసం
    సు.చి.న = సుమన్ చిరునవ్వు
    రా.న = రాక్షస నవ్వు
    కో.న – కోతి నవ్వు
    బి.న = బిస్కట్ నవ్వు
    దు.హా = దుఃఖహాసం (సుమన్ బాబు సినిమాలు చూసేటప్పుడు వచ్చేది)
    ప.న = పగలబడి నవ్వు
    పి.న – పిచ్చి నవ్వు
    వె.న1 = వెకిలి నవ్వు
    న.న.న – నవ్వలేక నవ్వే నవ్వు
    కిం.ప.దొ.న కింద పడి దొర్లే నవ్వు (ఇది పాతదే, కొత్తగా కలుపుతున్నా)
    శు.హా = శుష్క హాసం
    కె.న = కెవ్వు నవ్వు
    ఏ.న = ఏడవలేక నవ్వు
    పొ.ప.న = పొట్ట పగిలేటట్టు నవ్వు
    ఏ. న. న = ఏడ్చినట్టు నవ్వే నవ్వు
    కొం.న = కొంటె నవ్వు
    చ.న.న = చచ్చినట్టు నవ్వాల్సిన నవ్వు (బాసు జోక్ కి మనం నవ్వే నవ్వు)
    ద్రౌ.న. = ద్రౌపది నవ్వు
    దీన్నే
    కొం.కూ.న = కొంపలు కూల్చే నవ్వు (అని కూడా అనవచ్చు).
    వె.న2 = వెర్రి నవ్వు
    టి.అ.న = టివీ అనౌన్సర్ నవ్వు
    చిపి.న = చిలిపి నవ్వు
    వి.న = వికీ నవ్వు (మన నవ్వుకి ఎవడో వివరణ ఇస్తే అది వికీ నవ్వు)
    అనుమానంగా నవ్వే నవ్వు = అ.న.న
    ఏ.పో.మ.న = ఏడుస్తూ పోనీ మన మంచికే అనుకునే నవ్వు
    అప.హా = అపహాస్యం
    మె.హ = మెచ్చుకుంటూ నవ్వు
    కో.హా = కోప హాసం
    బో.న = బోసి నవ్వు
    తి.న = తిట్టుకుంటూ నవ్వు
    తిం.న = తింగరి నవ్వు
    క.న= కన్నుగీటుతూ నవ్వు
    గొ.న = గొర్రె నవ్వు
    ఆ.భా.న = ఆనందభాష్పాలతో నవ్వు
    వి.న = విలన్ నవ్వు
    పొ.న = పొగరుబోతు నవ్వు
    హే.న= హేళనగా నవ్వు
    గ.న = గర్వంతో నవ్వు

    @కృష్ణాజీః మీరు సీపుగా కొన్న దీపావళీ బాంబులు స్నిగ్ధగారితో నామీద పేల్చేలాగా కుట్ర చేస్తున్నారుగా !!

    • ఈ పదకోశాన్ని నాకు పంపిచినందుకు చాలా చాలా థాంకూలు 4E గారు …ఈ పద కోశం ఇంత అభివృద్ది చెందినదని నాకు ఇన్ని రోజులు తెలీలేదు సుమీ…నేను దీన్ని నా సిస్టం లో సేవ్ చేసుకుంటా…ఇన్ని అద్భుత ఆవిష్కరణలు చేసినందుకు బులుసు గారు ధన్యులు….
      ద.హా..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s