మీరు వింటున్నారు…..

సాధారణం

“హలో బెంగళూరు నీవు కేళ్తాయిదిర ఫీవర్ 104,బెంగళూరిన బొంబాట్ మ్యూజిక్ స్టేషన్”

“Stay tuned to radio mirchi 98.3, ఎఫ్.ఎం, సక్కత్ హాట్ మగా..”

“హాయ్ మైన్ హూన్ శంకర్,హాయ్ మైన్ హూన్ ఎహ్ సాన్,మైన్ హూన్ లాయ్….హం రేడియో వన్ కే నయీ పెహ్ చాన్,Maximum choice,Maximum Music”

ఇవీ నేను బెంగళూరు లో వోల్వో బస్సు ప్రయాణాలు మొదలు పెట్టినపట్నుంచి వింటున్న ఛానెల్స్…ఇంకా ఇట్టాంటివి  బోలేడు…

కాస్త ఆగమ్మాయి…నువ్వు బెంగళూరులో ఉన్నావు కాబట్టి అవి వింటున్నావు..మాకేంటి ఇవి చెప్తే అన్న క్వశ్చెన్ మార్క్ మొహం పెట్టకండే..అక్కడికే వస్తున్నా… బస్లో వెళ్ళేప్పుడు మా వాహన చోదకుడు రోజూ మా కోసం ఆఫిస్ కి వెళ్ళేప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని మంచి హుషారుగా,గల గలా మాట్లాడే ఆర్.జెలు  ఉండే ప్రోగ్రాములు పెట్టేవాడు.అతను పెట్టేది మనకి నచ్చకపోతే మనం వెళ్ళి మనకిష్టమైన స్టేషన్ పెట్టమని అడగొచ్చన్నమాట.అట్టా ఓ రోజు సాయంత్రం పాపం ఆయనకే  ఛానెల్స్ నచ్చక ఉన్న అన్ని  ఛానెల్స్ ని ట్యూన్ చేస్తూ చివరగా ఓ ఛానెల్ దగ్గర ఆగాడు…

ఎవరో ఆంటీ  మాట్లడుతున్నారు…

“ఆప్ సున్ రహే హైన్ వివిధ్ భారతి దేశ్ కీ సురిలీ దడ్కన్,అబ్ ఆప్ సునేంగె మన్ చాహె గీత్” ఇది వినగానే ఎక్కడో విన్నట్లుందే ఎక్కడా  అని ఆలోచిస్తుండగా ఓ ఫ్లాష్ బాక్ రీలు కళ్ళ ముందు కదలాడింది.

ముఖ్య గమనిక: ఫ్లాష్ బాక్ అంటే మరీ ఫాక్షన్  గట్రా ఎమీ లేదు..ఓ పేద్ద ఇంట్రడక్టరి సీన్లు ఊహించుకోకండే…

చిన్నప్పుడు అంటే ఓ నాలుగైదేళ్ళు ఉన్నఫ్ఫుడు  మా ఇంట్లో ఓ పేద్ద రేడియో పెట్టె ఉండేది…..అది పనిచెయ్యకపోయినా దాన్ని ఓ షో పీసులా భద్రంగా బీరువాలో దాచి ఉంచారు..అప్పుడే నేను మొదటి సారి రేడియోని చూడ్డం…అమ్మ అన్నం తినిపించేప్పుడు  మ్యూజియంలో ఒక వస్తువుని చూపించేటట్లు దాని చూపిస్తూ తినిపించేది. 🙂

 ఆ తరువాత నాన్నగారు ఓ మోస్తరు సైజ్లో ఉండే ట్రాన్సిస్టర్ ని తెచ్చారు.తను ఏవో కార్యక్రమాలు వినేవారు.ఓ రోజు పొద్దునే మెలకువ వచ్చి,నిద్ర నుండి లేవని ఓ లాంటి సుషుప్తావస్థలో ఉన్నప్పుడు మాటలేవో వినిపిస్తున్నాయి..పొద్దునే ఏంటబ్బా  ఈ గోల అనుకుంటూ లేస్తే రేడియోలో  ఏదొ ప్రోగ్రాం వస్తోంది..ఓ రెండు రోజులు ఇదే తంతు…ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు అనుకుంటూ ఇహ ఇట్లా కాదు గానీ మనమే త్వరగా లేవడం బెటర్ అనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాను.

ఆ పక్క రోజు అనుకున్నట్లుగానే పొద్దునే లేచి చూస్తే షరా మాములుగా రేడియో పెట్టుకుని వింటున్నారు.ఇంతకీ ఏంటబ్బా ఆ ప్రోగ్రాం అని వినగా…

ఇప్పుడు మీరు వింటున్నారు సూక్తి ముక్తావళి” అని చెప్పి మంచి తెలుగు సూక్తులు చెప్తున్నారు.

అప్పుడనిపించింది…హన్నా హెంత పని జరిగిపోయింది..ఇలాంటి మంచి కార్యక్రమాన్ని వినకుండా ఇన్ని రోజులు మిస్సయ్యామే అని..కొన్ని సూక్తులు రాసుకుని స్కూల్లో అసెంబ్లీ లో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి.

తరువాత రేడియో లో యాంకరమ్మ వేరే కార్యక్రమం గురించి చెప్తోంది..

  “ఇప్పుడు కాసేపు ప్రకటనలు,తరువాత వార్తలు ప్రసారమవుతాయి”

 ప్రకటనలు అయ్యే లోపల నే వెళ్ళి అమ్మిచ్చిన ఓ లోటాడు కాఫిని తెచ్చుకుని పేపర్ తీసుకుని ఓ చెవ్వు రేడియో వైపు పడేసి  చదువుకుంటున్నాను.

ఇంతలో వార్తలు ప్రారంభమయ్యింది.

“ఇతి ఆకాషవాణి చూష్యంతాం వార్తా ప్రవాకచః బలదేవానంద సాగరః….”

ఆ తర్వాతేమి చెప్పాడని అడక్కండే…

విన్న కొద్దీ సేపు ఏం భాషబ్బా అని ఆలోచించా..కొంచెం తెలుగులా ఉంది..హిందీ లా ఉంది…హేంటిది వెళ్ళి నాన్నగారిని అడగ్గా…అది సంస్కృతమని చెప్పారు…పైగా అది దేవ భాష అంత.ఈ దేవ భాషని మళ్ళీ చదివే అవకాశం ఇంటర్లో వచ్చింది..అది వేరే విషయం అనుకోండి.

 ఈ  వార్తలు అయ్యాక….

“తిరుపతి ఆకాశవాణి కేంద్రం,ప్రాంతీయ వార్థలు ,చదువుతున్నది “ అంటూ వార్తలు వచ్చేవి.

ఇవన్నీ కాదు కానీ అన్నింటి కంటే హైలైట్ ఆంగ్ల వార్తలే..

“All India Radio presents morning news”  అని ఓ మ్యూజిక్ బిట్ స్టార్ట్ అయ్యేది…ఏది విన్నా వినకపోయినా ఇది మాత్రం బాగా వినమని చెప్పేవారు నాన్నగారు…ఆంగ్లోచ్చారణ బాగా వస్తుందని.

ఈ కార్యక్రమాల టైమింగ్స్ తో మేము కూడా బాగా ట్యూన్ అయ్యిపోయి మా పనులు చక చకా ముగించేసుకునే వాళ్ళము…

వార్తలన్నీ అయ్యాక చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమయ్యేది.ఇదీ వినేసి స్కూలుకి వెళ్ళిపోయే వాళ్ళము.

రాత్రి పూట అమ్మ సిలోన్ కేంద్రం నుంచి ప్రసారాలు వినేది..దానిలో ఒక్కోసారి హిందీ పాటలు కూడా వేసే వాళ్ళు.

ఇవీ నేను రెగులర్ గా వినే కార్యక్రమాలు.నాకు తెలియకుండా ఇంకా మంచి కార్యక్రమాలు వినడం  మేము మిస్సయ్యి  ఉండొచ్చు. 😦

ఇంతలో  టి.వి క్రేజ్ రావడంతో అందరూ టి.వి సెట్లపై పడ్డారు మాతో సహా. పొద్దున పొద్దునే టి.వి. పెట్టుకుని చూస్తే అమ్మ  తిట్ల వర్షం కురిపించేది.అదేంటో రేడియో పెట్టుకుంటే ఎవరూ ఏమి అనేవాళ్ళు కాదు…కలికాలం 😛

ఆ తర్వాతర్వాత టి.వి లో కార్యక్రమాల ప్రసారాలు పెరగడంతో నిదానంగా రేడియో వినడం తగ్గింది.కానీ నాన్న గారు మాత్రం తన పొద్దున పూట వినే కార్యక్రమాలు వినడం మాత్రం మానలేదు.అప్పుడు మాత్రమే ఇంట్లో  రేడియో మోగేది. మిగతాప్పుడు మాత్రం పాపం మూగగా ఉండేది.

ఓ రోజు మా బంధువులు కొంత మంది వచ్చి మీ దగ్గర రేడియో ఉంది కదా…కొంచెం తీసుకురండి..అర్జెంట్ అని చెప్పారు..ఇంతకీ విషయమేమిటంటే ఆ రోజు క్రికెట్ మేచ్ ఏదో ఉందంట…కరెంట్ లేకపోవడం వల్ల ఎవరికీ టి.వి లో చూడ్డం కుదరక కనీసం రేడియోలోనైనా కామెంటరి విందామని వచ్చారట…అప్పుడుగ్గానీ మాకు రేడియో ఉన్న సంగతి గుర్తు రాలేదు…ఓ రోజు కరెంట్ పోయింది…చాలా బోర్ గా ఉంది…ఇంతలో అమ్మ రేడియో ని వెతికి,దుమ్ము పట్టిన దాన్ని శుభ్రం చేసి ప్రోగ్రాం పెట్టింది..అది వింటూ నేనూ,చిన్ని నిద్రపోయాము…ఇలా కాలక్షేపం ఏది లేదు అని అనుకోనే టైంలో రేడియో నేస్తం గుర్తొచ్చేది.

ఇహ శాటిలైట్ ఛానెల్స్ ప్రవేశంతో అది కాస్తా మరుగున పడింది…అప్పటికీ నాన్నగారు మాత్రం తన దినచర్యని వదల్లేదు… అదీ ఇంగ్లీష్ న్యూస్ కోసం..

అప్పటికి ఇంకా ఆకాశవాణి ప్రసారాలు మాత్రమే వచ్చేవి…ఓ రోజు అందరమూ ఇంట్ళోనే ఉన్నాము.పొద్దునే కరెంట్ పోయింది..అప్పటికి రోజు వారి పేపర్ చదవడం అయ్యిపోయింది..ఉన్న పనులు చేసేసుకున్నాము…ఇంకేమి చెయ్యాలో తోచలేదు..ఏం చేద్దామా  అని ఆలొచిస్తూ అలా  చూస్తే  రేడియో కనిపించింది…హమ్మయ్య ఇదన్నా ఉంది ఏమన్న ప్రోగ్రాములు వస్తాయేమో అని ట్యూన్ చేస్తూ ఉంటే సడెన్ గా అరవ పాటలు రావడం మొదలయ్యింది..తరువాత ఇంకో అమ్మాయి ఎవరో గల గల అని మాట్లాడుతోంది.విన్న ఆ కొద్దీ సేపు చాలా  బావుంది అని అనిపించింది..ఎందుకంటే అప్పటి వరకు విన్న ప్రోగ్రాంస్  గంభీరం గా ఉన్నట్లు అనిపించింది.శ్రోతలు కోరిన పాటలు అని అనుకుంటా అని ఒక ప్రోగ్రాం ఉండేది..అందులో యాంకరమ్మ కూడా అలాగే మాట్లాడేది చాలా గంభీరంగా..అలాంటిది ఈ అరవ ప్రోగ్రాం వినేప్పటికి జరా హట్కే అన్నట్లు అనిపించింది..దానికి తోడు..సెమ హాట్ మచ్చి అని ఓ టాగ్ లైన్…

ఆ తరువాత తెలిసింది ప్రభుత్వం వారు రేడియో కార్యక్రమ ప్రసార హక్కులను ప్రైవేట్ వారికి ఇచారని.వాళ్ళు కార్యక్రమ ప్రసారాలు మొదలు పెట్టారని.అప్పటికి టి.వి రంగంలో పాపులరైన  సన్ టి.వి వారు కూడా యఫ్.ఎం  రేడియో ఛానెల్ ప్రారంభించారు.అది కూడా బానే ఉండేది కాని మిర్చి అంత ఘాటుగా ఉండేది కాదు.

ఇక చెన్నై వెళ్ళాక యఫ్.ఎం రేడియో బాగా పాపులరయ్యిందని తెలిసింది. టి.వి యాంకర్స్ తో సమానంగా ఈ ఆర్.జెస్ కి పేరు వచ్చింది.వీరి పైన పత్రికలలో ప్రత్యేకంగా కవర్ స్టోరిలు కూడా వచ్చేవి.చాలా ఛానెల్స్ పోటాపోటిగా మొదలయ్యాయి.నేను అనుకునేదాన్ని మన దగ్గర ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని.మన దగ్గర కూడా స్టార్ట్ చేసారు అని తెలిసింది. ఓ సారి ఇంటికి వచ్చినప్పుడు యధాలాపం గా వింటోంటే ఇక్కడ స్టార్ట్ అయ్యిన ఛానెల్ లో ఏదో ప్రోగ్రాం వస్తోంది..కానీ ఎందుకో అంతగా నచ్చలేదు..ఎందుకో కృత్రిమంగా అనిపించింది…

ఆ తరువాత బెంగళూరు వచ్చి పడ్డాక అబ్బో ఇక్కడ బోలెడు  ఛానెల్స్ … వీరి పుణ్యమాని నాక్కూడా కన్నడం బాగా అర్ధమయ్యిపోతోంది …ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ వివిధ్ భారతి వినేప్పటికి ఈ ఫ్లాష్ బాక్ అంతా గుర్తొచ్చింది.

ఒక్కోసారి మా ఇంట్లో పొద్దునే  యం.యస్ గారి గాత్రం తో తెల్లవారేది..సుప్రభాతం వింటోంటే ఎంతో హాయిగా ఉండేది.అసలు సుప్రభాతం విని ఎన్నేళ్ళయిందో ..

ఆ ఆ ఫ్లాష్ బాక్ అయ్యిపోయింది…ఇంక ప్రెసెంట్  లోకి వచ్చేద్దాము….

అందరికీ టాటా బై బై!!

Stay tuned to Snigdha blog…vl be right back in some time…

అంత వరకు   Keep rocking!!!!

ప్రకటనలు

8 responses »

  1. 🙂 టీ వీ లోచ్చాక మానేసినా యూనివర్సిటీ లో ఉన్నప్పుడు, అలాగే ఉద్యోగం చేసిన బాచిలర్ రోజుల్లో రేడియో పక్కన పెట్టుకుని తెలుగు/హిందీ/అరవ పాటలు వింటూ నిద్రపోయేవాళ్ళం. తర్వాత కొన్నేళ్లు అసలు రేడియో జోలికి పోలేదు కానీ.. మళ్లీ ‘ఇది సక్కత్ హాట్ మగా..” వచ్చినప్పటి నించీ మళ్లీ కాస్త మొదలు పెట్టాము. ముఖ్యం గా కార్ లో బోల్డు ఎంటర్ టెయిన్ మెంట్..

  2. వాహన చోదకుడు..దీని అర్ధం ఏమి స్నిగ్ధ గారు..చందమామ చదివి నట్టు ఉంటుంది మీ బ్లాగ్ లో ఒక్కోసారి ….వాహన దోచే వాడు అని అనుకోని గట్టిగా నవ్వేసుకున్నా
    అనలైజేషన్ బావుంది
    ఏమి రేడియో లో ఏంటో… ఏ చానల్ వింటున్నా ఏమున్నది గర్వ కారణం बाते ज्यादा म्यूजिक कम :((((((((((((

    • మరీ చందమామ చదివినట్లు ఉంటుందా నా బ్లాగ్ చదివితే…మీరు పొగుడుతున్నారా లేక తిడుతున్నారా??

      ఇప్పుడే తెలుగు భారతి వారి నిఘంటువు నుండి తెలిసినదేమిటంటే చోదకుడు అనగా తోలువాడు అని…

      అనలైజేషన్ బావుంది>>>దీనికి థాంకు…
      ఏమి రేడియో లో ఏంటో… ఏ చానల్ వింటున్నా ఏమున్నది గర్వ కారణం बाते ज्यादा म्यूजिक कम (((((((((((
      >>>నిజమే అండి..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s