ఈ సారి శ్రావణ బెళగొళ

సాధారణం

మేలుకోటె ప్రయాణం పై రాసిన టపాలో ఈ విషయం రాయడం మర్చిపోయా…మేలుకోటె నుంచి శ్రావణ బెళగొళ 37 కి.మిలే.టైం ఎక్కువ పడుతుందేమో అని అటు వైపు వెళ్ళకుండా వెనక్కి వచ్చి శ్రీ రంగ పట్నకి   వెళ్ళిపోయాము.అంత దాకా వచ్చి నా దగ్గరకి రాకుండా వెళ్తారా అని గోమ్మటేశ్వరుడు అడిగినట్లు   అనిపించింది.సరే శ్రావణ బెళగొళతో పాటు వెరే ప్లేసెస్ ఉండేట్లు,ఒక రోజు లో వెళ్ళి వచ్చేలా  ఏమైనా  ప్యాకేజ్ ఉందేమో అని గూగ్లిస్తూంటే కె.టి.డి.సి వారి సైట్ కనిపించింది. అందులో చూడగా శ్రావణ బెళగొళ కి ఒక రోజు ట్రిప్ ప్యాకేజ్ ఉంది. ఇంతకు ముందు ఓ సారి  వారి వెబ్ సైట్ చూసినట్లు గుర్తు. అప్పుడెప్పుడో ఓ సారి వారి సైట్ చూసినప్పుడు  వారు ట్రిప్ కి తీసుకునే చార్జీలు కొంచెం తక్కువే ఉన్నాయి.పెట్రోల్ ధరలు పెరిగాక వాళ్ళు ఛార్జీలు పెంచినట్లు ఉన్నారు.వాళ్ళు కూడా బతకాలి కదండీ.. ట్రిప్ టైమింగ్స్ అంతా బానే ఉండడంతో టికెట్స్ బుక్ చేసేసుకున్నాము.

పొద్దున ఆరింటికి రిపోర్టింగ్ టైం.పోయిన సారిలా లేట్ చెయ్యకుండా బుద్దిగా ఆన్ టైంకి అక్కడున్నాము.ఆరు ముప్పావు కి అలా బస్ బయల్దేరింది. బెంగళూరు మైసూరు హైవే లో లా ఈ రూట్ లో భోజన పలహార శాలలు లేవు. ఓ దగ్గర మాత్రం కామత్,కాఫి డే కనిపించింది. దార్లో రెండు టోల్ గేట్లు వచ్చాయి. ఎనిమిదన్నర కలా బ్రేక్ ఫాస్ట్ కి ఆపారు. తరువాత మళ్ళీ ప్రయాణం కొనసాగించాము. ఆ బస్ లోనే గైడ్ ఒకరు వచ్చారు.ఈ  ట్రిప్ లో గైడ్ సౌకర్యం కూడా ఉందని మాకు తెలియదు. నామమాత్రపు రుసుం తీసుకుని బాగానే చెప్పారు.వెళ్ళే దారిలోనే యెడియూర్ సిద్ద లింగేశ్వర స్వామి వారి గుడి అని    చూపించారు. అది దాటాక ఆదిచుంచనగిరి మఠానికి వెళ్ళే ప్రవేశ ద్వారం కనిపించింది. వారి నిర్వహణ లో స్కూల్స్,కాలేజిలు ఉన్నాయి.ఇవి దాటేసాక శ్రావణ బెళగొళ వెళ్ళే రూట్ లోకి వచ్చేసాము.ఈ సారి సూర్య రావ్  ప్రతాపమేమి ఎక్కువ కనిపించలేదు. చల్లగానే ఉంది పైగా మాది వోల్వో బసాయే.. .రోడ్డుకి రెండు వైపులా కొబ్బరి తోపులు,వాటి మధ్యలో ఇళ్ళు …దారంతా పచ్చని చెట్లు …వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపించింది.

శ్రావణ బెళగొళ చేరే లోపు గైడ్ గారు ఆ స్థల ప్రాశస్త్యం గురించి  చెప్పెసారు.ఊరికి ఓ 10 కి.మీల నుంచే గోమ్మటేశ్వరుని విగ్రహం కనిపిస్తోంది. శ్రావణ బెళగొళ పట్టణం  వింధ్యగిరి,చంద్రగిరి అనే  కొండల మధ్యలో ఉంది. వింధ్యగిరినే ఇంద్రగిరి అని కూడా అంటారు.బస్ సరిగ్గా వింధ్యగిరి దగ్గర ఆగడంతో అందరమూ  ఇక దర్శనానికి బయల్దేరాము.గైడ్  మాతో పాటే గోమ్మటేస్వరుని సన్నిధి వరకు వచ్చి అక్కడి విశేషాలన్నీ  చెప్పారు. సుమారు ఓ 500 కి పైగానే మెట్లు ఉన్నాయి.కొండ మొదట్లో అంటే మెట్లు  ప్రారంభం అయ్యే దగ్గరే చిన్న పార్శ్వనాథుని  గుడి ఉంది. మెట్లు ఎక్కుతూ ఆ కొండ పై నుంచి ఊరిని చూస్తే భలే ఉందనిపించింది…మధ్యలో కల్యాణి,అటుపక్క చంద్రగిరి. చాలా బాగుంది అక్కడ నుంచి వ్యూ. పుష్కరిణిని కల్యాణి అని అంటారని నాకు అప్పుడే తెలిసింది. మెట్లు ఎక్కుతూ మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ  ఓ రాతి ప్రాకారం దగ్గరకి చేరుకున్నాము.

కొండ పై నుంచి తీసిన కళ్యాణి చిత్రం


వింధ్య గిరి పైనుంచి నుంచి తీసిన చంద్రగిరి

అంత వరకు  చిన్న చిన్న బృందాలు గా విడిపోయి వచ్చిన మేము ఇక్కడ   ఆగమని మా గైడ్ గారు చెప్పడం తో అక్కడే ఆగి , అందరము కలిసి ఒకే బృందం గా మా ప్రయణాన్ని తిరిగి కొనసాగించాము.అటు దగ్గరలోనే ఓ బండ పైన 24 జైన తీర్థంకరుల బొమ్మలు,గోమ్మటేస్వరుని బొమ్మ,ఇంకా జైన సంబంధ బొమ్మలవీ  చాల బాగా చెక్కి ఉంది.అది చూసుకుని ఒడెగల్ బసడి కి చేరుకున్నాము. దీన్ని త్రికూటబసడి అని కూడా అంటారు. ఒడెగల్ అంటే రాళ్ళు. ఎటువంటి పునాది లేకుండా రాళ్ళని పేర్చి ఒక మండపం లాగా దీన్ని కట్టారు.అందుకే దీన్ని ఒడెగల్ బసడి అని అంటారు.ఇక్కడ వాడినవి గ్రానైట్ రాళ్ళు.ఇందులో ఆదినాథ, నేమినాథ,శాంతినాథ వారి సన్నిధి ఉంది. ముగ్గురికి మూడు వేర్వేరు సన్నిధులు ఉన్నాయి అవీ మూడు దిక్కులలో.అందుకే దీన్ని త్రికూట బసడి అని అంటారట. ఆదినాథుడు 24 జైన తీర్థంకరులలో ప్రథముడు.ఈయననే వృషభనాథ అని,పురు దేవ అని కూడా అంటారు. గోమ్మటేస్వరుని తండ్రి.

ఈ బసడి కి పక్కనే కొండ పై కొన్ని శాసనాలు ఉన్నాయి. అవి పాడయ్యిపోకుండా దాని గ్లాస్ ఫ్రేంస్ లో  బిగించి ఆ శాసనం ఎప్పటిది అని వివరాలు తెలిపేలా చక్కగా ఓ బోర్డ్ పెట్టారు.

ఒడెగల్ బసడి

కొండపై ఉన్న శాసనాలు

ఒడెగల్ బసడి నుంచి వెళ్ళేప్పుడు అక్కడే “త్యాగద బ్రహ్మదేవుని స్థంభం” ఉంది. దీనినే త్యాగ స్థంభం,చాగడ కంబ అని కూడా అంటారట.

త్యాగ స్థంభం

దీన్ని దాటాక వచేది అఖండ బాగిలు లేక అఖండ ద్వారం.దీన్ని మొత్తం ఒకే రాతి నుంచి చెక్కరంట. దాని పై గజలక్ష్మి అమ్మవారి రూపం మనోహరం గా చెక్కబడి ఉంది. లక్ష్మి కి ఇరువైపులా ఏనుగుల తో పాటు ఓ ఊహజనిత ప్రాణిని చెక్కారు శిల్పులు. దాన్ని ‘మకర ‘ అంటారని మా గైడ్ గారు చెప్పారు.మకర లో అన్ని జంతువుల భాగాలు కనిపిస్తాయి.  ఈ అఖండ ద్వారం దగ్గరే గోమ్మటేశ్వరుని మరియు అతని సోదరుడు భరతేశ్వరునికి చిన్న గుళ్ళు లాగా ఉంది.

లక్ష్మి అమ్మవారి రూపం అఖండ ద్వారంపై

అఖండ ద్వార దర్శనం తరువాత విగ్రహం ఉండే ప్రధాన మంటపం దగ్గరికి వచ్చాము. అక్కడా కొన్ని బసడి లాంటివి ఉన్నాయి. గోమ్మటేశ్వరుని విగ్రహానికి ఎదుగురుగా “గుల్లకాయి అజ్జి” అనే ఒకావిడ విగ్రహం ఉంది. అది దాటుకుని ప్రధాన సన్నిధి ఉంది. విగ్రహం చుట్టూ ఓ పెద్ద మంటపం. అందులో 24 తీర్థంకరుల విగ్రహాలు మధ్యలో  గోమ్మతేశ్వరుని నిలువెత్తు విగ్రహం. ఆకాశానికి  అందుకునేలా ఠీవి గా ఉంది.

గుల్లకాయి అజ్జి

జైన మతం లో రెండు శాఖలు ఉనాయి.ఒకటి శ్వేతాంబరం కాగా,మరొకటి దిగంబర శాఖ. గోమ్మటేశ్వరుడు దిగంబర శాఖ కు చెందిన వాడు కావడంతో విగ్రహం కూడా ఎటువంటి అఛ్చాదనా లేకుండా ఉంటుంది.ఆయన కాయత్సర్గ   అనే  తపో భంగిమ లో ఉన్నట్టు చెక్కబడింది.తపస్సులో ఉన్నప్పుడు ఆయన చుట్టూ మొలిచిన పుట్టలు,తీగలు అన్నీ కూడా చాలా అందంగా చెక్కారు. ఆ తీగలే చేతి వరకు పాకినట్లు ఉంటుంది. విశాలమైన భుజాలు కలిగిన వాడు కావడంతో ‘బాహు బలి ‘ అని కూడా అంటారు.

ఉంగరాల జుట్టు, పెదాల పై కనిపించి కనిపించనట్లు ఉండే చిరునవ్వు,పేద్ద చెవులు,ఉదాసీనంగా చూస్తున్న కళ్ళు ఇవీ ఆయన ముఖం లో కనిపించే భావాలు. ఈ విగ్రహం ” World’s largest monolithic statue” గా పేరు గాంచింది. ఒకే రాతినుంచి మొత్తం విగ్రహన్ని చెక్కారంట.అంత పెద్ద మూర్తిని అంత దగ్గర నుండి చూడ్డం ఓ మర్చిపోలేని అనుభూతి.

హమ్మయ్య  అక్కడ చూసినవి మా గైడ్ చెప్పినవీ చెప్పేసా…ఇక అసలు విషయానికి వచ్చేస్తా…అదేనండీ శ్రావణ బెళగొళ కి ఆ పేరు ఎలా వచ్చింది..ఇంతకీ గోమ్మటేశ్వరుడు ఎవరు? ఎవరు ఆయన విగ్రహాన్ని చెక్కించారు,గుల్లకాయి అజ్జి ఎవరు  ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాము…దీని మన మంచమ్మాయి లక్ష్మి గారి స్టైల్లో అనుకోండి.:)

బ్రేక్ తర్వాత కార్యక్రమానికి పునః స్వాగతం …..

శ్రావణ బెళగొళ దక్షిణాదిన ఉన్న జైనుల దర్శనీయ,పూజనీయ స్థలాల్లో ముఖ్యమైనది. జైన మత సంబంధ కార్యక్రమాలకు ముఖ్య కేంద్రం. దక్షిణాదిన జైన మతం విస్తరణలో ముఖ్య పాత్రని పోషించింది.ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులందరు మతం అభివృద్దికి తమ వంతు తోడ్పాటుని అందించారు.ముందు దీన్ని బెళ గొళ అనే పిలిచేవాళ్ళట. బెళ అంతే తెల్లని అని, గొళ అంటే కొలను .ఇవి రెండూ కన్నడ పదాలు. ఇక్కడి కొలనులోని నీరు తెల్లగా ఉండేదట. సంస్కృత శాసనాల్లో కూడా దీని ప్రస్తావన  ఉండంట. కాకపోతే  శ్వేత సరోవరం,ధవళ సరోవరం,ధవళ సరస్సు అనే పేర్లతో పిలవడింది. ఇక్కడికి   “శ్రమణ” అనగా జైన మునులు తరచుగా వచ్చి తపస్సు చేసే వారట.  కాల క్రమేణా ఈ ఊరికి  శ్రావణ బెళగొళ అనే  పేరు స్థిరపడిపోయింది. ఇంకా దీన్ని గొమ్మటపుర అని కూడా అంటారట.

జైన తీర్థంకరులలో ప్రథముడైన ఆదినాథునికి జైన పురాణం ప్రకారం 101 మంది సంతానం.వారిలో భరతేశ్వరుడు,గోమ్మటేస్వరుడు   ముఖ్యులు.గోమ్మటేశ్వరుడు జన్మించినప్పుడు అతని గుండ్రని ముఖాన్ని చూసి అతనికా పేరు పెడ్తాడు ఆదినాథుడు. తన రాజ్యాన్ని కుమారులకీ  సమంగా పంచి తను సన్యాస  దీక్ష తీసుకుంటాడు. భరతునిలో రాజ్య కాంక్ష ఎక్కువయ్యి పొరుగు రాజ్యాలపై యుద్దాన్ని ప్రకటించి రాజ్యాన్ని  విస్తరించుకుంటాడు.శాంతి కాముకుడైన బాహుబలి తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని జనరంజకముగా పాలిస్తుండగా భరతుడు తమ్ముడి రాజ్యాన్ని తన రాజ్యం లో కలపమని,తనని సార్వభౌముడిగా అంగికరించమని చెప్తాడు.అందుకు బాహుబలి అంగీకరించకపోగా సోదరులిద్దరి మధ్య యుద్దం అనివార్యం అవుతుంది.రక్తపాతాన్ని నివారించడానికి సోదరులని పరస్పర యుద్దానికి అంగీకరింప చేస్తారు మేధావులు. ఆ యుద్దంలో బాహు బలిదే పై చేయి అవుతుంది. యుద్దం ముగిసాక నిర్వేదానికి గురైన బాహు బలి తన రాజ్యాన్ని భరతునికే ఇచ్చి తను అన్నీ బంధాలను త్యజించి మోక్ష సిద్దికై 12 ఏళ్ళ పాటు తపమాచరించి మోక్ష సిద్ది ని పొందుతాడు.

ఈ విగ్రహాన్ని ఇక్కడ తయారు చేసి ప్రతిష్టించింది  గంగ రాజుల దగ్గర మంత్రి గా ఉన్న చాముండరాయ.అతనై తల్లి ఐన కాళల దేవికి  వచ్చిన స్వప్నం ఆధారం గా విగ్రహం నెలకొల్పడానికి అనువైన స్థలం కోసం వెతుకుతూ శ్రావణ బెళగొళ కి వస్తాడు. అతనికి స్వప్నంలో యక్షిణి కుష్మాండిని దేవి దర్శనమిచ్చి అదే విగ్రహం నెలకొల్పడానికి అనువైన స్థలం అని చెప్తుంది. యక్షిణి ఆజ్ఙ్ఞ  ప్రకారం పక్కరోజు ఉదయం సూర్య కిరణాలు భూమిని తాకిన వెంటనే తన విల్లు నుండి బాణం సంధించగా అది వింధ్యగిరి పై పడుతుంది. బాణం పడిన చోటులోనే విగ్రహ ప్రతిష్టకు పూనుకుంటాడు చాముండరాయ.విగ్రహం తయారి 12 ఏళ్ళ  పాటు సాగుతుంది. చాముండరాయ విగ్రహం పూర్తయ్యాక మొదటి మస్తాభిషేకం  చేస్తాడు.ఆ అభిషేకం చేసేటప్పుడు కుష్మాండిని దేవి ఓ వృద్దురాలి రూపంలో వచ్చి చాముండరాయునికి గర్వభంగం కలిగిస్తుంది. ఆవిడే గుల్లకాయి అజ్జి. ఓ గొప్ప పని చేసాను అన్న అహం అతన్ని ఆవరిస్తుంది. అభిషేకం రోజు విగ్రహం పై అతను పోసిన పాలు విగ్రహం నడుము వరకు వెళ్ళకపోగా గుల్ల కాయి అజ్జి పోసిన పాలు మాత్రం పాదాల వరకు వెళుతుంది. దానితో గర్వభంగమైన చాముండరాయ ఆ అజ్జిని శరణు వేడగా బాహు బలి చేసిన త్యాగం ముందు నువ్వు చేసింది ఏ పాటిది అని ప్రశ్నిస్తుంది.చాముండరాయ త్యాగద స్థంభం వద్ద తన సర్వస్వాన్ని త్యాగం చేసి సన్యాస దీక్ష తీసుకుంటాదు. బాహుబలి విగ్రహం లో పాదాల పై చెక్కిన అక్షారాల్లో చాముండరాయుని పేరు ఉంది. ఆ తరువాత 12 ఏళ్ళకు ఓ సారి మహా మస్తాభిషేకం నిర్వహించడం  ఆనవాయితి అయ్యింది. దీన్ని ఓ ఉత్సవంలా అత్యంత వైభవం గా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం 12 రోజుల పాటు  జరుగుతుంది. 1981 లో విగ్రహం ప్రతిష్టించి వెయ్యేళ్ళు   పూర్తయ్యిన సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించారు.ఈ కొత్త మిలీనియం లో 2006 లో మహా మస్తాభిషేకాన్ని నిర్వహించారు.తరువాతది 2018 లోనే…

అవండీ మాకు ఇచ్చిన ఒక గంట సమయంలో విన్న,చూసిన విశేషాలు.కానీ ఈ ట్రిప్ లో చంద్రగిరి ని చూడ్డం మిస్సయ్యాము. 😦 అక్కడ కూడా జైన సంబంధ కట్టడాలే ఉన్నాయి. చంద్రగుప్త మౌర్యుని సమాధి కూడా ఉందంట.

ఈ వింధ్యగిరి,చంద్రగిరి,శ్రావణ బెళగొళ లొ మిగతా ప్లేసెస్ చూసి పొద్దునెళ్ళి సాయంకాలానికి బెంగళూరు చేరుకోవచ్చు అదీ మనం సొంతంగా ఏదైనా కార్ మాట్లాడుకుని వెళితే…

ఇక మా విషయానికి వస్తే మేము మా దర్శనం పూర్తి అయ్యాక వచ్చి తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించాము…

ప్రకటనలు

6 responses »

 1. >>>బృందం గా మా ప్రయణాన్ని తిరిగి కొనసాగించాము

  బాబోయ్ మీరు జానపద సినిమా లు చూడడం తగ్గించుకోవాలని హెచ్చరిస్తున్నాం…లేక ఆ వాతావరణ ప్రభావమో ఏదో మాయాశక్తి మిమ్మల్ని ఆవహించి ఉండి ఉంటుంది అనుకుంటా స్నిగ్ధ గారు..

  World’s largest monolithic statue అవునండీ చాలా సార్లు ఫ్రెండ్స్ చేసే ఈమెయిలు ద్వారా దీనిగురించి తెలుసుకున్నాం..దగ్గర నుండి చూడడం మంచి అనుభూతి

  ఒడెగల్ బసడి ఫోటో సూపర్ గా తీసారు

  మీ గైడ్ గారు చెప్పిన ఆ చరిత్ర అంతా ఎలా గుర్తించుకోగలిగారు..బాగా రాసారు పోస్ట్ ఈ నెలకి మరో పోస్ట్ పడే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అని తెలుస్తోంది ..

  అయ్యో చంద్రగిరి కూడా చూసేయాల్సింది మరో పోస్ట్ తో పాటు పుణ్యం దక్కేది తప్పక నెరవేరుతుందని ఆశిస్తున్నాము

  • కొంచెం గైడ్ చెప్పింది,కొంచెం గూగ్లించింది…
   నేను నెలకో పోస్ట్ రాస్తాననా మీ ఉద్దేశ్యం..
   గుర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్
   పోయిన నెలే ఆ jinx ని బ్రేక్ చేసాను కదండీ…
   🙂
   మరీ అంత జానపదం గా ఉందా…>>>బృందం గా మా ప్రయణాన్ని తిరిగి కొనసాగించాము…ఐతే దీన్ని మారుస్తాలేండి..

 2. చక్కటి తెలుగు లో మీరు రాసిన ఈ టపా మమల్ని చాలా బాగా అక్కటు కుంది…!పేరు చూడగానే ఏదో మేము కూడా మీతో పాటు శ్రావణ బెళగొళ వెళ్తున్నాము అనే భవన్ కలిగింది…!మంచి హాస్యము తో టపా అని ప్రభంచి చక్కని సమాచారం,మంచి చాయ చిత్రాలు మాకు అందించారు..!ఇలాంటి ప్రయాణాలు మీరు మరిన్ని చేయాలనీ ఆశిస్స్తూ ,మాకు మర్రిన్ని పుణ్య క్షేత్రాల గురించి ,విహార కేంద్రాల గురించి అందిచాలగలరు అని ఎదురు చూస్తూ

 3. స్నిగ్ధ,

  మేమెప్పుడు వెళ్దామని అనుకున్నా.. ఏమోలే అని ఊరుకోవటం జరుగుతోంది. మీ టపా చూసాకమళ్లీ ఉత్సాహం వచ్చింది. ఈసారి వెళ్తాము..

  • అవునా ప్రియ గారు,తప్పకుండా వెళ్ళి రండి…చూడాల్సిన ప్లేస్…మీరెలాగు బెంగళూరు లోనే ఉన్నారు కాబట్టి మేలుకోటె కూడా వెళ్ళి రండి…
   నా బ్లాగ్ని దర్శించి కామెంటినందుకు బోలెడు థాంకులు…
   🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s