అప్పుడెప్పుడో చదివా…ఇప్పుడు రాస్తున్నా..

సాధారణం
అప్పుడెప్పుడో “Dark Goddess” టపా రాసినప్పుడు…ఈ నవల పూర్తి చేశా…అప్పుడే దీని గురించి రాద్దామని 
అనుకున్నాను…మళ్ళీ ఒక డౌట్ వచ్చింది…ఈ అమ్మాయికి ఏమి పన్లేదు ఎప్పుడూ పుస్తకాల గురించే రాస్తూ
ఉంటుంది అని అనుకుంటారని కొన్ని రోజులు ఆగా…:P..ఆ కొద్ది రోజులు ఇన్ని రోజులు అయ్యాయి…
మీరేమి అలా అనుకోరని నాకు తెలుసు…అందులోనూ ఇది నాకు బాగా నచ్చిన నవల.లేటయ్యితే అయ్యింది 
కానీ మంచి నవలని పరిచయం చేయటం మిస్సవ్వకూడదని ఇప్పుడు ఈ టపా స్టార్ట్ చేసా.

అనగనగా ఓ స్కూల్…ఎంతో మంది విద్యార్థులను మంచి విద్యావేత్తలు గా,మంచి పౌరులుగా తీర్చిదిద్దిన స్కూల్…
ఉత్తమ క్రీడాకారులను దేశానికి అందించిన ఘనత కలిగిన పాఠశాల.ఏ స్కూల్ కి లేని పే.....ద్ద క్రీడా 
మైదానం దీని సొంతం.మిగతా పాఠశాల్లలో తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకున్న ఆ విద్యాధామం ప్రస్తుతం
గత వైభవాన్ని కోల్పోయి తన మనుగడ కోసం పోరాడుతోంది.అలాంటి పరిస్థితుల్లో ఆ స్కూల్లోనే ఇది వరకు
పనిచేసి రిటైరైన విశ్వనాథ శర్మని తిరిగి ప్రిన్సిపాల్ గా నియమించాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానిస్తుంది.
శర్మగారు క్రీడా విభాగాన్ని అందులోనూ క్రికెట్ జట్టుని మరింత ప్రోత్సహించాలని కొన్ని తీర్మానాలను 
తయారు చేసుకుని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ప్రవేశపెట్టగా డైరెక్టర్స్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి.
ఆ తీర్మానాన్ని ఇద్దరు బలంగా వ్యతిరేకిస్తారు.వారు ఆ స్కూల్లోనే పనిచేసే టీచర్,ఇంకొకరు ఆ స్కూల్
పూర్వ విద్యార్థి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారి.ఆ క్రీడా మైదానంపై కన్నేసిన అతను ఎలాగైనా దాన్ని
సొంతం చేసుకోవాలని ఆశిస్తాడు.టీచరేమో తనని తాను ఆ స్కూల్కి ప్రిన్సిపల్ గా ఊహించుకుని మరిన్ని 
కోచింగ్ సెంటర్లు పెట్టాలని కోరుకుంటుంటాడు.

శర్మ గారు చెప్పినది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని,ఆట స్థలం వల్ల ఏ ఉపయోగం లేదని దానికి బదులు
ఆ స్థలంలో ఏదైనా బిల్డింగ్ కట్టి కోచింగ్ సెంటర్ లాంటిది ప్రారంభిద్దామని సలహా ఇస్తారు.అందుకు ఒప్పుకోని
శర్మగారు తన వంతు వాదనని వినిపిస్తారు.పిల్లలకి చదువుతో పాటు “Extra Curricular activities”
కూడా ముఖ్యమని అందులోనూ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్లేయర్స్ టీంలో ఉన్నారని వారిని ప్రొత్సహిస్తే 
భవిష్యత్తులో మరింత రాణిస్తారని చెప్తారు. దానికి కన్విన్స్ అయ్యిన డైరెక్టర్స్ శర్మ గారి తీర్మానాలను
ఆమోదించబోగా దాన్ని వ్యతిరేకించి గత కొన్నేళ్ళుగా ఏ టోర్ని గెలవని స్కూల్ జట్టు పై టైం వృధా
చేయొద్దని చెప్తారు. శర్మ గారు కొద్దిగా టైమివ్వమని ఈ సారి జరిగే ఇంటర్ స్కూల్ టోర్నమెంట్లో జట్టు ప్రదర్శన
చూసి నిర్ణయించుకోమని చెప్పగా దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోద ముద్ర వేస్తారు.

శర్మ గారు ఆ స్కూల్ పూర్వ విద్యార్థి మరియు మంచి క్రికెటరైన సంపత్ ని క్రికెట్ కోచ్ గా నియమిస్తారు.
మొదట సంపత్ కోచ్ గా పనిచెయ్యడానికి ఒప్పుకోకపోయినా శర్మ గారి పట్టుదల,తనపై ఉన్ననమ్మకానికి
తలవంచి కోచ్ గా బాధ్యతలను స్వీకరిస్తాడు.మంచి ప్లేయర్సే అయినా మొక్కుబడిగా ఆడే జట్టు సభ్యుల్లో
సంపత్ ఎలాంటి మార్పుని తెచ్చాడు. శర్మ గారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలిపాడా?
అండర్ డాగ్స్ గా ఉన్న స్కూల్ టీం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ ఐన ఎవర్ గ్లేడ్ స్కూల్ తో పోటి పడిందా?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే బుక్ చదవాల్సిందే.

ఇదీ నేను అప్పుడెప్పుడో చదివిన "The Men with in-A cricketing Tale " కథాంశం.
ఈ కథంతా చదివిన తరువాత మీకేదో గుర్తుకు వస్తోంది కదా...ఆలోచించండి...

"మేము గెలవగలం" అనే నమ్మకాన్ని టీంలో కలింగించడమే సంపత్ ప్రధాన కర్తవ్యం.ఇందులో సంపత్ జట్టు
సభ్యులను మరియు కెప్టెన్ ని ఎంపిక చేయడానికి వాడే స్ట్రాటెజి,టీం బలాబలాలను అంచనా వేసే విధానం
ఇవన్నీఆసక్తికరంగా ఉంటుంది. అందుకు అతను ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాడు అన్నది బుక్ చదివి
తెలుసుకుంటే బాగుంటుంది.క్రీడా నేపథ్యంలో మనకి ఎన్నో సినిమాలు ,పుస్తకాలు వచ్చుంటాయి.కాని క్రికెట్
నేపథ్యంగా తీసుకుని వచ్చిన తొలి ఆంగ్ల నవల ఇదేనట.దీన్ని రాసినది మన తెలుగతనే.
పేరు హరిమోహన్ పరువు.ఇది హరిమోహన్ గారి తొలి నవల.


కానీ చదివితే తొలి నవల అని అనిపించదు.అంత చక్కగా,సరళమైన ఆంగ్ల పదాలతో రాశారు.
నవల చదువుతున్నంతసేపు స్కూల్లో నేనూ కూడా ఒక స్టూడెంటయ్యిపోయా..
టీం సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా బాగా రాసారు.వారి మధ్యన ఉన్న ఫ్రెండ్ షిప్,వారి అలకలు
ఇవ్వన్నీ చదువుతోంటే నేను కూడా నా స్కూల్ రోజుల్లోకి వెళ్ళొచ్చా. ఎక్కడా మనకి ఏదో పాఠం చెప్తున్నట్లు
అనిపించదు.ఆయా పాత్రల ద్వారా మనకి బోలెడు మేనెజ్ మెంట్ టిప్స్ అందించారు రచయిత. 

అలాంటి వాటిలో కొన్ని టిప్స్... ఇవి నాకు నచ్చినవి...ఇంకా బోలెడు ఉన్నాయి...గుర్తురావడం లేదు....
ప్లీజ్ అడ్జస్ట్ మాడి...

   Believe in yourself.
   Key to success is to Relaxation. Key to relaxation is breathing.
   The indication of excellence is when the small things are done well.
   Slow down but don't stop while doing any work.

నవల చదివితే ఫన్,యాక్షన్ తో పాటు బోలెడంత మోటివేషన్,ఇన్స్పిరేషన్ ఫ్రీ.
ఈ నవల అన్ని వయసుల వారికి,క్రికెట్ ప్రేమికులకి, క్రికెటర్స్ అవ్వాలనుకుంటున్నవారికి రికమెండెడ్..
ముఖ్యం గా కార్పొరెట్స్ కి హైలీ రికమెండెడ్.

ఇంతకీ స్కూల్ స్కూల్ అని చెప్పాను గాని స్కూల్ పేరు చెప్పలేదు కదా...ఈ నవల్లో అతి ముఖ్య పాత్ర 
పోషించిన స్కూల్ పేరు "గోల్కొండ పబ్లిక్ స్కూల్"...

రచయిత గురించిన మరిన్ని వివరాలు కావాలంటే ఈ వెబ్ సైట్ హరిమోహన్ చూడండి..
ఇందులో రచయిత నవల ప్రచురణానుభవాలు గురించి తెలుసుకోవచ్చు.బుక్ లాంచ్ గురించిన విశేషాలు..
ఈ నవల పై ప్రముఖుల అభిప్రాయాలు,రచయిత వ్యక్తిగత వివరాలు మరెన్నో ఉన్నాయి.
త్వరలోనే మరో మంచి పుస్తకం కబుర్లతో.....

8 responses »

 1. monna maa TV lo ee cinema chusinappudu intha manchi cinema endhuku hit kaledha anukunna..!alage intha bhaga story evadu rasaru ani kuda anukunna..konchem Laagan style unna cinema lo naaku nachindhi students and teachers madhya relationship.
  appudu idhi oka Novel based film ani matrame vinna,,kani aa novel mana telugu vadu rasina english novel ante konchem surprise ayyanu..!
  meeru kotha books ni ilage parichyam cheyandi…!
  anni sarlu books gurinchi rasina borekottadhu anukunta..

 2. Believe in yourself.
  Key to success is to Relaxation. Key to relaxation is breathing.
  The indication of excellence is when the small things are done well.
  Slow down but don’t stop while doing any work.

  Excellent! thanks for sharing

  మీరు Remember the titans సినిమా చూసారా the theme is almost the same

  ఇక విషయానికొస్తే
  స్నిగ్ధ గారు ఎలా ఉన్నారు ఏమి చెప్పమంటారు మీరు నెలకోసారి ఎప్పుడో ఒక్కో పోస్టేసి సైలెంట్ గా మంత్ జంప్ లు వేస్తారు అక్కడ మా బ్లాగుల్లో కామెంట్లు లేక మేము పోస్ట్లు రాయడమే ఆపెస్తున్నాం
  కామెంట్ రాయకపోయినా పర్వాలేదు ఫాలో బటన్ ని కొట్టి మీ గురువు గారి పరువు నిలపవల్సింది గా ప్రార్ధన

  శిష్యురాలా సుఖీభవ !

  • అలా ఏమి లేదండి గురువు గారు..మొన్నే మీ ఎనీ వే నాశన చదివా…కామెంటలేదు సారి…ముందు పార్టు మిస్సయ్యా..అది చదివి కామెంటుదామని…
   ఇహ చూస్కోండి మీ బ్లాగులో కామెంట్లే కామెంట్లు…మీరు పోస్ట్లు రాయడం స్టార్ట్ చేయండి..ఆశీర్వచనములకి ధన్యవాదములు గురుజీ…

 3. స్నిగ్ధ గారూ నా బ్లాగులో కామెంట్లువ్రాసే స్నిగ్ధ మీరేనా?
  మీకు బ్లాగు ఉందా? నాకు తెలీనే తెలీదు. ఈరోజు అనుకోకుండా నా కంటపడింది, కానీ ప్రొఫైల్ వెతికితే కనిపించలేదు. మీరేనా, కాదా అని తేల్చుకోలేకపోతున్నాను. మీరేనా?

  ఒకవేళ మీరే అయితే హమ్మ చెప్పాపెట్టకుండా ఇలా బ్లాగు మొదలెట్టేస్తారా!
  ఏమిటి ఈ మధ్య నా బ్లాగు మీద సీతకన్ను వేసారు?

  ఒకవేళ మీరు కాకపొతే పైనరాసినవన్నీ ignore చేసి పక్కనబెట్టేయండి. మీ బ్లాగు స్పేస్ వాడుకున్నందుకు సారీ 🙂

  • సౌమ్య గారు, మీరా…కళ్ళు తిరిగి పడిపోయి,.ఆనంద భాష్పాలతో నేను 🙂 మీరు నా బ్లాగులో కామెంటండమా…ఏమి నా భాగ్యం!! అవునండీ..అది నేనే అది నేనే…చెప్పా పెట్టకుండా స్టార్ట్ చెయ్యలేదండి..ఏదో అలా స్టార్ట్ చేసా..వేణుశ్రీకాంత్ గారు,హరే గారు ఏదైనా సంకలినిలో పెట్టమని చెప్పారు…ఈ మధ్యే యాడ్ చేశా…మీ బ్లాగ్ పైన శీతకన్ను వేయడమేంటండి…మీరే ఈ మధ్య రాయడం తగ్గించారు…

   • హహ హమ్మయ్యా మీరేగా..సంతోషం…బ్లాగాభివృద్ధిరస్తు…ఇంక మీ టపాలన్నీ చదవాలి తీరిక చేసుకుని. 🙂

    నేను రాయడం కొంచం తగ్గిందిలెండి ఈ మధ్య బిజీగా ఉండి…కానీ అడపాదడప రాస్తూనే ఉన్నానండోయ్!

   • అవునండీ అది నేనే…మీ ఆశీర్వచనములకి ధన్యవాదాలు,మీరు బ్లాగు చూసినందుకు సంతోషం…కానీ ఎలా రాసానో మీరే చెప్పాలి…ఏదో నాకు తోచింది రాసాను…
    :)మీ కొత్త టపా చదివానండీ…కామెంటడానికి టైము కుదరలేదు…ఇప్పుడు పెడతాగా..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s