సమరభారతి

సాధారణం

నమస్కారం…హలో హాయ్ …వణక్కం….ఆదాబ్…సత్ శ్రీ  అకాల్..జై శ్రీకృష్ణ(ఈ మధ్య  కొన్ని హింది సీరియల్స్ లో గుజరాతి కమ్యూనిటి  వారి స్టైల్ ని కాపి కొట్టా :D) … హమ్మయ్య అందరికీ హాయ్ చెప్పేసా….  బ్లాగ్స్ చూడకుండా నెల రోజులు గడిపేసా ,వెరీ బాడ్. :(… మితృల బ్లాగ్స్ చూసి కూడా చాలా  రోజులయ్యిపోయింది.  అందరికీ నేను ఉన్నాను అన్న సంగతి చెప్దామని ఈ టపా మొదలు పెట్టా….

చాలా చాలా ఆలస్యంగా శ్రీ ఖర నామ సంవత్సర శుభాకాంక్షలు.ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నవన్ని జరగాలని ఆశిస్తున్నాను.అలాగే బిలేటెడ్ పుత్తాండు/విషు  వాళ్తుక్కళ్..

ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను అందరూ బాగా ఎంజాయ్ చేసుంటారు. 28 ఏళ్ళ తరువాత కప్ సాధించిన మన ఇండియన్ క్రికెట్ జట్టుకు హార్థిక  శుభాభినందనలు. చక్ దే ఇండియా…కీప్ రాకింగ్!!ప్రపంచ కప్ సంబారాలు ముగిసి ఐ.పి.ఎల్ ఫీవర్ పట్టుకుంది కదా ఇప్పుడు. ఎంజాయ్ మాడి!!

అందరినీ పలకరించేసా,ఉగాది శుభాకాంక్షలు చెప్పేసా…కప్ సాధించిన మన టీమిండియా కి కంగ్రాట్స్ చెప్పేసా…ఇక నా టపా అసలు విషయం కి వచ్చేస్తా.

టైటిల్ ‘సమరభారతి’  అని పెట్టి అందరికీ హాయ్ లూ,హలోలు చెప్తోందేంటి అనుకుంటున్నారా? చాలా రోజులయ్యింది కదా …అందుకే…..

చాలా రోజులుగా అనుకుంటున్నాను దీని గురించి రాద్దామని..ఏంచేతనో టైం కలిసి రాక,లేక నేను రాసింది నాకు నచ్చకో  కుదరలేదు.చివరాఖరికి ఈ రోజు ధైర్యం చేసి మొదలు పెట్టేసా…చూద్దాము ఎలా సాగుతుందో…

మొన్నామధ్య ఇల్లు సర్దుతోంటే కొన్ని చిత్రాలు…చిత్ర సంకలనాలు…దాని గురించి కొన్ని వివరాలు దొరికాయి.ఎవరివా అని చూస్తే ఆ చిత్రాలు మా వారి తాతగారు వేసినవట.తను గొప్ప చిత్రకారులు అని తెలుసు. కాని వారి గురించి వినడమే తప్ప వారి  చిత్రాలను చూసే అవకాశం రాలేదు.ఇప్పుడు వారి చిత్రాలను,సంకలనాన్ని చూసిన తరువాత నాకు వచ్చిన మొదటి మాట…”వా…….వ్”.మనకు అసలే కళా పిపాస ఎక్కువ కావడంతో వెంటనే వివరాలను సేకరించే పనిలో పడ్డా… ఆయన గురించిన వివరాలు  ఇంత ఆలస్యం గా నాకు తెలిసినందుకు కొంచెం బాధ కలిగింది….కాని  ఇప్పటికైనా నాకు ఆ చిత్రాలను చూసే మహద్భాగ్యం కలిగింది… తాతగారి చిత్రాలను,వారి గురించిన వివరాలను కొన్ని నా బ్లాగ్లో రాసుకొందామని అనుకున్నాను…కాని అది వెంటనే కార్య రూపం దాల్చలేదు…:(

ప్రస్తుతం తాతగారి గురించిన సమగ్ర వివరాలు, వారి కళా కౌశలానికి అద్దం పట్టిన చిత్ర వివరాలను గురించిన విశేషాలను కనుక్కునే పనిలో ఉన్నాను……

వారి చిత్రాల్లో నాకు అమితంగా నచ్చిన ఈ సమరభారతి చిత్రాన్ని ఈ టపాలో పెడుతున్నాను..

“సత్యముని ఆయుధముగా చేబూని మహిషాసుర మర్ధిని రూపంలో ఉన్న భరతమాత కావిస్తున్న దుష్ట సంహారం”

ఆయన అప్పుడే ఈ చిత్రం గీసారంటే గ్రేట్ కదా…

ఇప్పుడు మన దేశం ఉన్న పరిస్థితికి భరతమాత మళ్ళీ ఈ అవతారం ఎత్తి దుష్ట సంహారం కావించాలి...... 

ఈ చిత్రం గురించిన వివరాలను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను…
వివరాలు తెలిసిన వెంటనే తరువాతి టపాలో పెడదామని నా ఆలోచన...

మీకు ఇది నచ్చుతుందని ఆశిస్తూ…తాతగారి గురించిన  మరిన్ని వివరములు తదుపరి టపాలో....
ప్రకటనలు

15 responses »

 1. స్నిగ్ద గారు చిత్రం చాలా బాగుంది. కానీ తక్కువ రిజల్యూషన్ లో మాత్రమే కనిపిస్తుంది. హై రిజల్యూషన్ చిత్రం కూడా పెట్టగలరా.. అప్పట్లోనే 3D చిత్రాలను గీసిన మీ తాతగారి వివరాలు తెలుసుకోవాలని ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాను..

  • ఇది నేను రాయగలనా లేదా అంటూ మొదలుపెట్టానండీ….ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కూడా అనిపించింది..నాకు అంత భావుకం గా రాయడం రాదండీ…కానీ అంత గొప్ప కళాకారుడిని ఈ తరం వారికి పరిచయం చేయటానికే ఈ చిన్న ప్రయత్నం…మీరు దానికి సానుకూలం స్పందించి ప్రోత్సహించినందుకు సదా కృతఙ్ఞురాలిని..

   చాలా సెంటి గా రాసాను కదా….
   🙂

 2. మన దేశంలోని “హిడ్డెన్ టాలెంట్” కి ఇది ఒక ఉదహరణ అనిపించింది నాకు ఈ బ్లాగ్ చదివిన తరువాత.ఇప్పుడున్న పరిస్తితుల్లో భరత మాత ఎన్ని అవతరలు ఎత్తాలో అని కూడ అనిపించింది 🙂
  మీరు ఇలానే మరిన్ని బొమ్మలు పొస్ట్ చేస్తారన్న నమ్మకముంది నాకు(ఎందుకంటే మీరూ ఒక కళాపిపశి కనుక 🙂 )

  పై బొమ్మ మరింత క్లారిటీ గా మీకు దొరికి వుంటే బావుండేది.

  • జ్యోతి గారు, బ్లాగ్ని దర్శించి కామెంటినందుకు ధన్యవాదాలు..మరిన్ని మంచి చిత్రములు టపాలో పెడతానండీ(కళా పిపాసిని కాబట్టి)….
   😀

 3. స్నిగ్ధ .. మీ తాతగారు చాలా బాగా వేసారు 🙂 ..

  ఇలాంటివి వెలుగులోకి తేవడం చాల మంచి పని .. ఇంకా వివరాలు తెలుసుకుని చెప్పు త్వరగ 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s