కొత్త నవల చదివానోచ్ !!!

సాధారణం

ఈ  మధ్య లైబ్రరీ కి వెళ్ళినప్పుడు ఏ పుస్తకం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఫిక్షన్ బుక్స్ ఉండే సెక్షన్ కి వెళ్ళా..ఎప్పుడూ చూడూ ఈ అమ్మాయి  లైబ్రరీ,పుస్తకాలు అని  అంటుంది..వేరే పనేమి లేదా అని అనుకోకండే..మన ఉద్యాననగరిలో ప్రయాణం చేసేప్పుడు బహు బాగు టైంపాస్ పుస్తకాలే మరి…. సరే సరే…ఇప్పుడు ప్రెసెంట్ లోకి వచ్చేద్దాము…అలా ఫిక్షన్ బుక్స్ సెక్షన్ దగ్గర కలెక్షన్ ఏముందా అని చూస్తున్నాను..బుక్స్ తీస్తూ రచయితల పరిచయం చదువుతూ తెగ తిరిగేస్తున్నాను…ఏది తీసుకోవాలో అర్ధం కావటంలేదు…ఇంతలో ఒక నవల కనిపించింది..పరిచయం చదివితే ఆసక్తికరం గా ఉంది…రచయితా ఎవరా అని చూస్తే ఎవరో కొత్త అతను…సర్లే చదివి చూద్దాము…నచ్చకపోతే ఇచ్చేద్దాము అని తీసుకొచ్చా..

ఒక పది పేజీలు చదివేప్పటికి బోర్ గా అనిపించింది…ఎందుకు తీసుకొచ్చామా అని అనిపించింది..రిటర్న్ చేసేద్దాం అని అనుకున్నా..పక్క రోజు ఆఫిస్ కి వెళ్తున్నా..బాగా బోర్ గా ఉంది…చదవడానికేమి లేదే అని అనుకుంటూ బాగ్ తీసి చూస్తే నేను నిన్న నవల చదివేసి బాగ్ లోనే మర్చిపోయినట్లున్నా…సర్లే  చదివి చూద్దాము అనుకుంటూ మొదలుపెట్టా…ఆఫిస్ దగ్గరకి వచేంత వరకు నాకు టైం తెలీలా..బాగుందనిపించింది… నిన్నే  నవలని పూర్తి చేశా..మీకు పరిచయం చెయ్యాలని అనిపించింది….దాని పర్యవసానమే ఈ టపా…

నవల నవల అంటోంది ఏం నవలో చెప్పడం లేదేంటి అని అనుకుంటున్నారా ..చెప్తున్నా చెప్తున్నా..చెప్పడం ఏంటి…నవల ఫ్రంట్ పేజీనే చూపిస్తా….

ఫొటోని కొంచెం జూం చేసారంటే ఈ నవల ఫ్రంట్ పేజీ పైన ఒక కాప్షన్ ఉంటుంది..

“There is nothing to be feared but fear itself and Billi Sangreal”

ఈ కాప్షన్ భలే నచ్చింది నాకు…హీరోయిన్ కి పవర్ ఫుల్ కాప్షన్ పెట్టారు కదా….ఈ పాటికి మీకర్ధమయ్యిపోవాలే…ఈ నవల హీరోయిన్ ఒరియంటడ్ అన్నమాట… 🙂
కథ కొంచెం  సింపుల్ గా చెప్తానే…

హీరోయిన్ పేరు కాప్షన్ లోనే ఉంది……బిల్లి సాంగ్రియల్. బిల్లి “The knights Templar” అనే పురాతన క్రిస్టియన్ మిలిటరి  ఆర్గనైజేషన్ లో సభ్యురాలు. దీని గురించి చెప్పాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి.దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది.

Poor Fellow-Soldiers of Christ and of the Temple of Solomonకి కామన్ పేరే “The knights Templar”. Order of the Temple అని కూడా  పిలిచేవారు.రెండు శతాబ్దాల పాటు వీరి కార్యకలాపాలు చురుగ్గా కొనసాగాయి.ఈ సంఘం ఆవిర్భవించడానికి ముఖ్య కారణం అప్పట్లో జరిగిన పవిత్ర యుద్దాలు . జెరూసలేం మరియు చుట్టుపక్కల ప్రదేశాలని పవిత్ర స్థలాలుగా భావించేవారు.మొదటి పవిత్ర యుద్దం తరువాత జెరూసలేం  క్రైస్తవ సేనల ఆధీనంలోకి వచ్చినా దాని చుట్టుపక్కల ప్రదేశాల్లో  మాత్రం  ఇంకా శాంతి నెలకొనలేదు.బందిపోట్ల తాకిడి ఎక్కువగా ఉండేది.యాత్రికులకి సరైన రక్షణ లభించేది కాదు. కొంత మంది ఊచకోత కోయబడ్డారు. దీని వల్ల యాత్రికులుతమ రక్షణార్థం వందల సంఖ్యలో ప్రయాణించేవారు.

1119లో మొదటి పవిత్ర యుద్దంలో పాల్గొన్న ఫ్రెంచ్ యోధులు “Hugues de Payens”,”Godfrey de Saint-Omer” యాత్రికుల రక్షణార్థం సైన్యాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనని అప్పటి జెరుసలేం రాజైన King Baldwin II ముందుంచగా,రాజు వారి అభ్యర్ధనని మన్నించి  వారి స్వాధీనంలో ఉన్న Al Aqsa Mosque లో నుంచి కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతినిచ్చారు.Al Aqsa Mosque “Temple of  Solomon” శిథిలాలపై నిర్మితమైందని భావిస్తోన్న”Temple Mount” లో ఉంది.దాన్నే వారు తమ ప్రధాన కార్యాలయం గా చేసుకున్నారు.మొదటగా తొమ్మింది మంది యోధులతో మొదలైన వీరి శ్రేణి విరాళాల పై అధారపడేది. అందుకే వీరు తమని తాము Poor Fellow-Soldiers of Christ and of the Temple of Solomon అని పిలుచుకున్నారు. వారి చిహ్నం “ఇద్దరు యోధులు ఒకే గుర్రాన్ని అధిరోహించడం” వారి పేదరికాన్ని సూచిస్తుంది.వారి పేదరికం ఎంతో కాలం నిలవలేదు.తర్వాతి క్రమంలో వారు చర్చ్ వారిచే అధికారకంగా ఆమోదించబడిఆర్ధికంగానూ మరియు సంఖ్యాపరంగానూ వృధి చెందింది.

Templar knights అపార పోరాట నైపుణ్యం కలిగిన వారు. పవిత్ర యుద్దాలలో వీరిది ప్రత్యేక పాత్ర.ఈ సంఘంలో కొంతమందే యుద్దాలలో పాల్గొనే వారు. మిగిలిన వారు సంఘాన్ని ఆర్ధికంగా వృధి చెందేందుకు తమ వంతు సాయాన్ని అందించేవారు.పవిత్ర యుద్దంలో పాల్గొనదలచిన వారు, యాత్రికులు వారి ఆస్తులను,విలువైన వస్తువులను వీరి దగ్గర భద్రపరచి వెళ్ళేవారు. ఒక రకంగా ఇప్పుడుండే లాకర్ కాన్సెప్ట్ ని టెంప్లార్స్ అప్పుడే ప్రవేశ పెట్టారు.”letters of Credit” ని యాత్రికులకి ఇచ్చేవారు. ఒక రకంగా బాంకింగ్ కి పునాదులు వేసింది ఈ సంఘమే.తరువాతి కాలంలో తమ ప్రాభవాన్ని కోల్పొయారు. అంతిమంగా ఫ్రెంచి రాజైన Philip IV ఒత్తిడికి తలవొగ్గి చర్చ్ సంఘాన్ని అధికారకంగా రద్దు చేసింది. వీరి కనుమరుగు అనేక ఊహలకు చోటిచ్చి ఇప్పటికీ  Templar ని పాపులర్ గా  నిలిపింది.

దీన్ని గురించి రాయాలంటే ఈ టపా సరిపోదు. అందుకే కొన్ని విషయాలనే రాస్తున్నాను.

ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దామే…

బిల్లి తండ్రి ఆర్థర్ కూడా ఈ “Knights Templar” లో సభ్యుడే.పైగా “Master of the Templars”.ఆర్థర్  బిల్లి కి చిన్నతనం నుంచే  శిక్షణని ఇప్పిస్తాడు. తండ్రి,మిగతా సంఘ సభ్యుల పర్యవేక్షణలో యోధురాలిలా రాటుదేలుతుంది.

నవల ప్రారంభంలో బిల్లి Werewolves లో ఒక తెగ అయిన Polenitsy తో పోరాటంలో విజయం సాధిస్తుంది. werewolves గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. సగం తోడేలు సగం మనిషన్నమాట. మనుష్యులను వేటాడి తింటుందన్నమాట. ఎవరినా వీటి  దాడిలో గాయపడితే వాళ్ళు కూడా  Werewolf గా మారిపోతారట. Polenitsy లో అయితే స్త్రీలే పవర్ ఫుల్ అట ఈ నవల ప్రకారం.

వీటితో పోరాడేప్పుడు గాయాలయితే టెంప్లార్స్ దగ్గర ఔషధాలు రెడీ గా ఉంటాయన్నమాట. లేదంటే వాళ్ళు కూడా తోడేలుగా మారిపోతారు కదా.బిల్లి వీటిని చంపడంలో నిష్ణాతురాలు.అలా ఒక దాన్ని చంపిన తర్వాత తనతో వచ్చిన తోటి టెంప్లార్ని వెతుకుతుండగా ఈ గుంపు ఒక ఫార్మ్ హవుస్ లోకి వెళ్ళడాన్ని చూస్తుంది. వాటిని అనుసరించిన బిల్లి కి అక్కడ ఒక తొమ్మిదేళ్ళ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు వీటి దాడిలో చనిపోతారు.ఇంతలో ఆర్థర్ ఇతర టెంప్లార్ సభ్యులు అక్కడికి చేరుకుంటారు. ఆ అమ్మాయి తన పేరు వసిలిసా అని ,తాము రష్యా నుండి ఇక్కడికి వచ్చామని చెప్తుంది.తన తల్లిదండ్రులు తనకి అక్కడ రక్షణ లేదని, అందుకే ఇక్కడికి తీసుకొచ్చారని చెప్తుంది.ఆర్థర్,మిగతా సభ్యులు వసిలిసా ఒక  “Psychic child” అయ్యిఉండొచ్చని భావిస్తారు. Polenitsy వారు ఇలాంటి  psychic childని తాము పూజించే దేవత అయిన బాబా యాగ కి బలివ్వడానికి తీసుకెళ్ళడానికి వచ్చిఉంటారని అనుమానిస్తారు.వసిలిసాని తమతో పాటు  తీసుకెళ్తారు.

వారి ఇంట్లో కొన్ని సంఘటనల వల్ల వసిలిసా మాములు Psychic child కాదని ఒక avtaar,oracle అని తెలుసుకుంటారు.వెంటనే తనని జెరూసలేం పంపించాలని నిర్ణయించుకుంటారు.వారి ఇంటిని కూడా Polenitsy  అటాక్ చేస్తారు. అక్కడ నుంచి తప్పించుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే టైంలో వసిలిసా కనిపించదు.తనని  తీసుకెళ్ళిపోయారని తెలుసుకున్న టెంప్లార్స్ తనని రక్షించడానికి  ఆర్థర్ నేతృత్వంలో ఒక బృందం,బిల్లి నేతృత్వంలో మరొక బృందం రష్యాకు వెళ్తారు.ఆర్థర్ వసిలిసా కుటుంబ సభ్యులను కలసుకుని బాబా యాగ గురించిన వివరాలు సేకరించి బిల్లిని కలిసేలా ప్లాన్ చేసుకుంటారు.

రష్యాలో టెంప్లార్స్ లా శక్తివంతమైన మరొక శ్రేణి “Bogatyrs “నాయకుడైన Alexiovich Romanovని కలిసి సహాయం కోరమని ఆర్థర్ బిల్లి బృందాన్ని ఆదేశిస్తాడు.ఆ పని మీద వెళ్ళిన బిల్లి అనుకోకుండా ఒక వ్యక్తిని werewolf అటాక్ నుండి రక్షిస్తుంది.అతను ఎవరో కాదు “Bogatyrs”  నాయకుడి కొడుకు Ivan Alexiovich Romanov అని తెలుస్తుంది. కాని అతను తనకి ఇష్టం లేకపోయినా Koshchey అనే గార్డియన్ పర్యవేక్షణలో ఉంటాడు.ఇవాన్ని కాపాడినందుకు థాంక్స్ చెప్పడానికి వచ్చిన కొష్ చెయ్ వీరు పని వచ్చిన పని తెలుసుకుని వీరికి సాయం చేస్తానని మాటిస్తాడు.ఇవాన్ తండ్రి కూడా Polenitsy వారి చేతిలోనే హతమయ్యాడని చెప్తాడు.ఇవాన్ కూడా వీరి బిల్లి కి సాయం చేయడానికి  సిద్దపడతాడు తన తండ్రిని చంపిన వారిపై  పగ తీర్చుకోవడానికి.తరువాత జరిగిన కొన్ని అనూహ్య సంఘఠనలతో ఇవాన్, బిల్లి మిగిలిన బృందం నుంచి విడిపోయి వారికి దొరికిపోతారు.బిల్లి వారి అటాక్ లో తీవ్రంగా గాయపడుతుంది.

ఇంతకీ వసిలిసా ఏమయ్యింది? బిల్లి వసిలిసా ని బాబా యాగ నుంచి రక్షించిందా? ఇవాన్ తన తండ్రి ని చంపిన వారి పై పగ తీర్చుకున్నాడా? Werewolf దాడిలో గాయపడ్డ బిల్లి మరొక Werewolf గా మారిందా అనేది మిగతా కథ.

చదువుతున్నంత సేపు నాకు ఏదో ఫెయిరీ టేల్ చదువుతున్నట్లు అనిపించింది…సాహసాలు బాగుంది. చదివినంత సేపు మన జానపద కథలకి కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చినట్లు అనిపించింది. ఎంతైనా విఠలాచార్య సినిమాలు చూశాము కదా 🙂 .అంతర్లీనంగా మనిషి ప్రకృతి కి చేస్తున్న అన్యాయాన్ని రచయిత టచ్ చేసినట్లు అనిపించింది.

రచయిత ఎవరో చెప్పలేదు కదూ…సార్వత్ చద్దా….ప్రస్తుత నివాసం లండన్. అతని తొలి నవల “Devil’s Kiss”.ఇది Dark Goddess  నవల కి ప్రిక్వెల్.రచయిత గురించిన వివరాలకు ఇక్కడ చూడండి.

ఈ టపా పూర్తి చేసే సమయానికి ఇంకో నవల సగం పూర్తి చేసాను. దీని ప్రీక్వెల్ కాదు. నా తదుపరి టపా ఆ నవల పైనే…త్వరలో దీని ప్రీక్వెల్ చదివి దాని గురించి ఇంకో టపా రాస్తాను.

P.S : Knights of Templar గురించిన వివరాలు సేకరించింది వికీపీడియా నుంచి.వారి చిహ్నం కూడా.

12 responses »

 1. 🙂
  ఐనా ఏకబిగిన అంతలేసి లావుపాటి నవలలు ఎలా చదువుతారో అర్ధమవట్లా….
  ముచ్చటపడి గాంధీగారిని, ఆర్కే నారాయణ్ గారిని తెచ్చుకున్నా…..వాళ్ళేమో ఇప్పుడు కర్రపట్టుకొని ఉన్నారు ‘మమ్మల్ని మూలన పడేస్తావా’ అని.
  keep goin

  • 4E గారు, చాన్నాళ్ళకి కామెంటారు మా బ్లాగ్లో…ఈ ఉద్యాననగరిలో ట్రాఫిక్ నా చేత చదివిస్తోంది… 🙂
   గాంధి గారు, ఆర్.కె. నారాయణ్ గారు మిమ్మల్ని కొట్టేలోపల చదివేయండీ…

 2. హ్మ్ చాల బాగుంది .. స్నిగ్ధ .. అమ్మో చదవడమే కాకుండా ఓపికగా అన్ని రాసినందుకు నీకు హాట్సాఫ్ 🙂
  నవల్స్ చదవడం చాలా మంచి హేబిట్ .. నేను ఇదివరకు పుస్తకాల పురుగులా చదివే దానిని .. హ్మ్ కాని ఇప్పుడు చాల బాడ్ హేబిట్స్ వచ్చేసాయిలే 🙂

  • థాంక్స్ కావ్యా..ముందు చిన్నది గా రాద్దామనే అనుకున్నాను…టెంప్లార్స్, Werewolves అవి ఇవి వాడారు…అందరికీ కొంచెం అర్ధమయ్యేలా చెప్దామని రాసా…అదేమో లెంత్ ఎక్కవయ్యింది…

 3. స్నిగ్ధ గారు క్షమించాలి
  ఈ వరల్డ్ కప్ దయవల్ల బ్లాగులు కాదు కదా మెయిల్ లు కూడా చెక్ చేసుకోలేనంత బిజీ 🙂
  డెవిల్స్ కిస్ గురించి ఉపోద్ఘాతం రాస్తారు అనుకున్నా
  స్టొరీ రెండే రెండు లైన్స్ ఉంటుంది narration లో ఉండే తేడా నే నోవెల్ కి ప్రాణం
  ఆ హీరోయిన్ కాప్షన్ వలన ఒక మంచి పోస్ట్ వేసారు
  next prequel review కోసం వెయిటింగ్ 🙂

  • హరే గారు,చాన్నాళ్ళ తరువాత మా బ్లాగ్లో కామెంటారు…మీరు మా గురువులు..మీరు ప్రొత్సహించకపోతే ఎలాగండీ…
   😛
   ఐతే మీరు డెవిల్స్ కిస్ చదివారన్నమాట..నేను ఈ బుక్ చదివిన వెంటనే ఆ బుక్ కోసం లైబ్రరీ లో ట్రై చేస్తే దొరకలేదండీ…త్వరలోనే చదువుతా…

 4. ninnu gurtu chesukoni roju undadu telsa …
  blog chusinappudalla ee pilla emaipoyindi ane ankuntaa ..
  kaani nee contact em ledu blog lo alaa raste enti intha extralu chestondi ankuntaru ani urukunnaa .. hammaya vachesava ..
  nannu add chesko lekapote champestaa

  • ఎప్పటికప్పుడు నీ బ్లాగ్లో కామంటాలని అనుకుంటాను…కానీ కుదరలేదు..కాని నేను నీ పోస్ట్లు చదువుతూనే ఉన్నాను…అమ్మో అలా అనకు కావ్యా…నిన్ను యాడ్ చేసుకుంటాన్లే…కొంచెం ఈ మధ్య బ్లాగ్స్ చూడ్డం తగ్గింది…కొన్నే చదువుతున్నాను…:(

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s