డిసెంబర్-జనవరి ఙ్ఞాపకాలు-3

సాధారణం

చక్కగా  ఇలా హోం వర్కులు,సెలవలూ మధ్యేలో వచ్చే పండగలతో జీవితం ఆనందం గడచిపోతోందనుకుంటుండగానే 10 వ తరగతిలోకి వచ్చేశాము.  ఇది జీవితాన్ని డిసైడ్ చేసే క్లాస్ అని అందరూ మాకు క్లాస్ పీకేవాళ్ళే.ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవాళ్ళు ఏ క్లాస్సమ్మా? అని  మనం 10th  క్లాస్ కి  వెళ్తున్నాను ఆంటీ లేదా అంకుల్ అనడం తరువాయి …వాళ్ళు మొదలు పెట్టేవారు. ఓ 10 క్లాస్…నీ లైఫ్ ని డిసైడ్ చేసే క్లాస్…బాగా  కష్టపడాలి…బాగా చదవాలి …అంటూ వారికి తోచిన సలహాలు ఇచేవాళ్ళు…ఖర్మకాలి వాళింట్లో 10 కంప్లీట్ అయ్యిన పిల్లలుంటే వారిచే ఒక కె.టి సెషన్ ఇప్పించేవాళ్ళు. 😦 ఇరుగు పొరుగు వారు,బంధు గణం,ఆఖరుకి అమ్మా,నాన్న వాళ్ళు కూడా ఇలా అందరూ సెషన్స్ ఇచ్చేసారు..దీంతో అన్నీ  సరదాలు కట్. ఎప్పుడు చూడు ఆ రివిషన్ టెస్టులు,ఈ టెస్టులు అనీ బుర్ర తినెసే వాళ్ళు. క్వార్టర్లీ,హాఫ్ యియర్లీ పరిక్షీలకి ఇచ్చే సెలవల్లోనూ  స్కూల్కి రమ్మనే వాళ్ళు. 😦 దీని బదులు హోం వర్క్ల రోజులే మేలనుకుంటాను…ఇలా పదవ తరగతి అనే ఒక అధ్యాయమును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఒక రెండు నెలలు సెలవలొచ్చాయి.

ఇన్ని రోజులు డ్రిల్లింగ్  వల్ల మైండ్ బాగా  పాడయ్యిపోయింది,ఉన్న ఒక్క బుర్రకి కొంచెం రెస్ట్ ఇద్దామంటే మా పాలిట  విలన్లుగా తయారయ్యారు ఇంటర్  కాలేజీల వాళ్ళు. అప్పుడే కాన్వాసింగ్ మొదలెట్టేసారు.  నేను చదివినప్పుడు నారాయణ,శ్రీ చైతన్య లాంటి కార్పొరెట్ కాలేజీలు మా ఊరిలో లేవు. ఇప్పుడు వీటి దృష్టి మా ఊరిపైన పడింది.వారి శాఖలు మా ఊర్లో ఏర్పాటు అయ్యాయని విన్నాను. సో ఉండే రెండు కాలేజీల మధ్యే తీవ్ర పోటి ఉండేదన్న మాట. ఒకళ్ళు మార్చి ఒకళ్ళు వచ్చి బుర్ర తినేవాళ్ళు.
ఇళ్ళకి రావడం మీరు మా కాలేజీలోనే  చేరాలి అంటూ బుర్ర తినడం,మేము మీ కాలేజీలోనే చేరతాము మహాప్రభో అని చెప్పేంతవరకు వదిలేవాళ్ళు  కాదు. ఇది ఫస్ట్ రౌండ్ కాన్వాసింగ్. ఫరీక్షల ఫలితాలు వచ్చాక ఇంకో రౌండ్  ఉండేది. ఫలితాలు వచ్చేసాయి. ఇంటర్ జాయిన్ ఆయిపోయాము. అసలు సినిమా మొదలయ్యింది. వారం కి ఏడు రోజులు కాకుండా ఎక్కువుండాల్సింది వీళ్ళకి. ఏడు రోజులూ  కాలేజి   పెట్టుకుని చంపేసారు. మేము చదివేటప్పుడు చదివితే   ఇంజినీరింగ్ లేదా డాక్టరీ అన్నట్లు ఉండేది  మా ఇంట్లో వాళ్ళ వ్యవహారం. నాకు తెలియకుండా ఈ  సరదాలు అన్నింటికీ  నిదానంగా దూరమవ్వసాగాను.అమ్మ వాళ్ళు కూడా తనని చదువుకోని ఎందుకు డిస్టర్బ్ చేయడమనేవాళ్ళు. ఇంటర్ అనే అధ్యాయమునూ,ఎంసెట్ అనే ఒక  పరమపదాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఇంజినీరింగ్లోకి అడుగుపెట్టాము.

ఇక్కడ కొంచెం  నయం.కాకపోతే మీరు ప్రొఫెషనల్ కోర్స్ లో ఉన్నారు.సో ప్రొఫెషనల్స్ లా బీహేవ్  చేయండి అనేవారు. ఇంజినీరింగ్ లో మొడటి రెండు సంవత్సరాలు  సరదాగా గడచిపోయినా తరువాత రెండేళ్ళు కాంపస్ సెలెక్షన్స్ కి రెడీ అవ్వడానికి సరిపోయింది.వెంటనే ఉద్యోగమూ వచ్చేసింది.
చదువయ్యిపోగానే ఉద్యోగం వచ్చేసిందిఅని అందరూ  ఆకాశానికెత్తేసారు.భవిష్యత్తు దేదీప్యమానంగా కనిపించింది. ట్రయినింగ్ అంతా సజావుగా సాగింది.ఇంకా ఆల్ హేపీస్ అనుకుంటుండగా అసలు సినిమా మొదలయ్యింది.ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యాక తెలిసింది అసలు సంగతి. ఓక పూట లీవ్  కావాలన్నా సవాలక్ష ఫార్మాలిటీస్స్. వీకెండ్ ఇంటికెల్దామంటే ఒక పదిహేను రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలి.
పండక్కి వెళ్ళంటే సెలవు కోసం ఆడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. లక్కీ డ్రా లో మన పేరుంటే సెలవిస్తారు లేదంటే లేదు. ఒక సారి సంక్రాంతి పండక్కి ఇంటికి వెళ్ళలేదు. 😦  జీవితం మరీ  మెకానికల్ అయ్యిపోతున్న ఫీలింగ్ కలిగింది. తెలియకుండానే పండగ సరదాలు అన్నీ మిస్ అవుతున్న ఫీలింగ్.

ఇప్పుడు  హోం వర్కులు చేసిన రోజులు, సెలవుల్లో చేసిన అల్లరి, అమ్మమ్మ గారి వూర్లో   గడపిన రోజులు అన్నీ గుర్తొస్తే ఏదో బాధ.అమ్మ ,నాన్న గారు వాళ్ళు చిన్నతనంలో చేసిన అల్లరి గురిచి మాకు చెప్పేవారు. మాకేమో  ఆ ఛాన్స్ లేకుండా పోయింది. నేనూ, చిన్ని ఇలా రాంకుల వరదలో ఇరుక్కున్న  వాళ్ళమే. అలా అని ఆ ప్రవాహంలో పూర్తి గా కొట్టుకు పోకుండా ఏవో కొన్ని ఙ్ఞాపకాలను పోగేసుకున్నాము. ఆ ఙ్ఞాపకాలే ఇలా టపాగా రాసాను.

ప్రకటనలు

6 responses »

  1. స్నిగ్ధ నీ బ్లాగు ఇప్పుడు దాక నేను చూడలేదు .. అమ్మో 🙂 సూపరు కదా
    కష్టాలు అనేవి అలానే వస్తు ఉంటాయి 🙂 గుండె గట్టిగ పట్టుకోవాలి :p

      • అయ్యో నాకంత లేదు .. నువ్వు అనే అనచ్చు కానీ .. అసలు నీ బ్లాగు గురించి నాకు తెలీదు .. ఇప్పటి నించి ఇంకా నీ బ్లాగులో కామెంట్లే కామెంట్లు 🙂 నే వచ్చాక పిచ్చి అల్లరి స్టార్ట్ :p

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s