డిసెంబర్-జనవరి ఙ్ఞాపకాలు-2

సాధారణం

హోం వర్క్ రాస్తూ ఎట్టకేలకు పూర్తి చేసి బయల్దేరాను.దారిలో చిన్ని నిజంగానే నువ్వు హోం వర్క్ రాసేసావా అని అడిగింది. దీనితో నాకు తిక్క రేగి నీ ముందే రాస్తున్నాను గా..నువ్వు చూసావు గా.రాసాను అని చెప్పా. ఏదో నీ మంచి కోసం అడిగాం,ఎందుకంత కోపం అని అన్నది. రాసేసాను, ‘Dont worry’ అని చెప్పా…స్కూల్ కి రీచ్ అయ్యి ఎవరి క్లాసులకి వెళ్ళి పోయాం.పది రోజుల తర్వాత ఫ్రెండ్స్ని కలవడం కదా…క్లాస్ సందడి గా ఉంది. కొంత మంది ఊరెళ్ళిన ముచ్చట్లు అన్నీ  చెప్తున్నారు. ఇంతలో హోం వర్క్ ప్రస్తావన రానే వచ్చింది.కొంత మంది అన్ని సబ్జెక్ట్స్ రాసుకొచ్చామన్నారు.కొంత మంది కొన్నే రాసాము, మరికొంత మంది అసలు రాయడం కుదరలేదు టీచర్కి చెప్తాము అని ధీమాగా చెప్పారు.  వీళ్ళని చూస్తే ఓ పక్క హాశ్చర్యం గాను మరో పక్క భయంగానూ అనిపించింది.  అలా ఎలా ధీమాగా చెప్తున్నారా అని…ఒక వేళ మనం రాయకుండా వచ్చి ఉంటే మనకేమి పనిష్మెంట్ ఇస్తారా అని.

పాత టపా లెంత్ ఎక్కువతుందని అక్కడ రాయలేదు. హాలిడేస్ హోం వర్క్ రాయడానికి ఒక ఫార్మట్ ఉండేది. ఏదో ఒక 100 పేజీల బుక్కు కొని రాసుకెళ్ళడానికి లేదండోయ్. ఒక వేళ బుక్కులో రాసుకెళ్ళినా కొంత మంది వాళ్ళ పేపర్ని అప్పుడే కరెక్షన్ చేసి ఇస్తే మనం బతికాం లేదంటే ఇప్పుడు మీ బుక్స్ ఇవ్వండీ నేను లీషర్ టైం లో చూసి కరెక్షన్ చేస్తాము అని అనేవాళ్ళు. తర్వాత పీరియడ్ వచ్చే టీచర్ నా సబ్జెక్ట్ హోం వర్క్  రాసుకొచ్చారా అని అడిగితే ఫలానా  తీచర్ తీసుకెళ్ళారు.తర్వాత చూపిస్తాము అని చెప్తే అంతే సంగతులు.హోం వర్క్ రాసుకు రానందుకు  కొత్త సాకులు చెప్తున్నారా అని అనే వాళ్ళు. బాబోయ్ ఎందుకొచ్చిన గొడవలు అని అందరమూ ఆయా సబ్జెక్ట్స్ సెపరేట్గా white papers లో రాసుకొద్దామని డిసైడ్ అయ్యాము.

ఇలా హోం వర్క్ రాసుకు రమ్మని చెప్పిన రోజు వెంటనే ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పి ఒక రెండు డజన్ల తెల్ల కాగితాలు తెప్పించుకునేవాళ్ళం. చిన్ని ఏమో చకా చకా నాలుగు రోజుల్లో అన్ని సబ్జెక్ట్స్ రాసేసిది. నాకు తెచ్చిన కాగితాల కట్ట అలానే ఉండేది. ఒక నాలుగు రోజులు తర్వాత నాన్నగారు అడిగారు “ ఏమ్మా,నీకు తెచ్చిచిన పేపర్స్ అలాగే ఉంది. రాసే ఉద్దేశ్యం ఏమైనా ఉందా?” అని. సో పబ్లిక్ డిమాండ్ వల్ల నాకు రాయక తప్పింది కాదన్నమాట . 🙂 ఇక పేపర్ని తీసుకుని చక్కగా మార్జిన్స్ కొట్టి, పేరు,క్లాస్, సబ్జెక్ట్, ఏ ఎగ్జాంస్ ది హోం వర్క్ రాస్తున్నామో రాయాలన్నమాట. ప్రశ్నలన్నీ రెడ్ ఇంక్ తో , ఆన్సర్స్ బ్లూ ఆర్ బ్లాక్ తో ఉండాలన్నమాట.రాయడం పూర్తయ్యాక చక్కగా ఆయా ఆయా సబ్జెక్ట్ పేపర్స్ ని  పిన్ చేసేవాళ్ళం.ఈ ఫార్మాట్లో   మిగతా సబ్జెక్ట్స్ అన్నీ  పూర్తి చేసేవాళ్ళం. మనకి వర్క్ లోడ్ ఎక్కువుంది కదా ఎవరికైనా అవుట్ సోర్స్ చేద్దామంటే చేతి రాత లు తేడాలు వస్తుందేమో అని ఎవరికి ఇవ్వలేదు.  😦
ఇక్కడ కట్  చేస్తే…

ఇప్పుడు… నా ఖర్మ కాలి నేను కొంచెం ఎగరగొట్టి రాసిన సబ్జెక్ట్ టీచర్దే  ఫస్ట్  పీరియడ్. ఆవిడ రాగానే  అందరినీ అడుగుతోంది హోం వర్క్ ఫినిష్ చేసుకొచ్చారా…చేయని వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్తోంది. కొంత మంది ఎక్ష్ప్లెనషన్  ఇవ్వడానికి ట్రై చేస్తే ఒప్పుకోలేదు. :(.ఇంక మిగతా వాళ్ళవి కరెక్ట్  చెయ్యడం స్టార్ట్ చేసారు. నాకేమో టెన్షన్ గా ఉంది. అందరి పేపర్లు అలా పైన నుంచి ఒక సారి చూసి కరెక్ట్ చేస్తున్నారు. అర డజను కాగితాలు ఒక రెడ్ ఇంక్ పెన్ కి లోకువయ్యినట్లు(కొన్ని సమయాల్లో సదరు రెడ్ ఇంక్ లేకపోతే పెన్సిల్ని కూడా వాడేవారు)అంత కష్టపడి రాసుకొస్తే తనేమో ఒక్కొకళ్ళది మూడు నాలుగు నిమిషాల్లో దిద్దేసారు. నా వంతు రానే వచ్చింది. పేపర్ తీసుకెళ్ళి ఇచ్చాను. టెన్షన్ గా ఉంది. ఒక్కో పేపర్ ని చూస్తూ కరెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ పేపర్ వచ్చింది (మనం ఎగర గొట్టిన ప్రశ్న ఉన్న పేపర్). ఊరికే అలా చూసి సంతకం పెట్టేసారు.

హమ్మయ్య అని అనుకున్నాను. ఫైగా నీట్ గా రాసినందుకు  గుడ్ అని రాసారు… :D. తరువాత ఇంటర్వెల్ టైంలో ఫ్రెండ్సందరూ మాట్లాడుకుంటున్నాము.నేనడిగాను మీరంతా అంత త్వరగా అన్ని పేపర్స్ ఎలా రాసేసారు? వాళ్ళిచ్చిన సమాధానం “అక్కడక్కడా కొంచెం ఎగర గొట్టి”. హన్నా…ఇంత చిన్న విషయం నాకెందుకు తోచలేదు..అనవసరంగా పేరాలకు పేరాలు రాసేసానే అని అనిపించింది..అయినా ఆ ఫీలింగ్ బయట పడనీయకుండా..oh I see అన్నా…

ఈ దెబ్బతో ఇంకో సారి ఇలాంటి బృహత్తర హోం వర్క్ కార్యక్రమాలు మొదటి మూడు నాలుగు రోజుల్లోనే కంప్లీట్  చెయ్యడం స్టార్ట్ చేసా… ఇక్కడితో హోం  వర్క్ ల  కథ అయ్యిపోయిందని అందరం సంబర పడ్డాము ఎందుకంటే మా సీనియర్స్ రాంగ్ ఇంఫర్మేషన్ ఇచ్చారు..హయ్యెర్  సెక్షన్స్ కి హోం వర్క్ ఇవ్వరని… తర్వాత    తెలిసిందేమిటంటే…ఈ తరగతుల్లో ఒక్కో సబ్జెక్ట్ కి రెండేసి పేపర్లని హిందీ కి తప్ప. 6 సబ్జెక్ట్లకే రాయలేక చస్తోంటే ఇప్పుడు 11 పేపర్లకి హోం వర్క్   రాయలా అని అందరం దిగులు పడ్డాము. ఏం చేత్తాము రాయక తప్పుద్దా అని  మనసు దిటవు చేసుకుంటూంటే కొంత మంది టీచర్లు హోం వర్క్ రాసుకు రమ్మని చెప్పారు…కొంత మంది అక్కర్లేదని చెప్పారు. చాలా మంచి మనసు  కదా వీళ్ళది. ఇంక 9th క్లాస్ లో  మాత్రం కొంత సడలింపు ఇచ్చారు.లాంగ్వెజెస్    రాయక్కరలేదని..గ్రూప్స్ మాత్రం రాయమ్మన్నారు…దీనికి మిగతా టీచర్లు ఉడుక్కున్నారు.ఇలా హోం వర్క్లు  ఇత్యాది కార్యక్రమాల పరంపర కొనసాగుతున్నాయి.

డిసెంబర్-జనవరి ఙ్ఞాపకాలు అని రాసి మన ముగ్గుల ప్రహసనం గురించి  నేను రాయకపోతే నా టపా టైటిల్కి అన్యాయం చేసినదాన్నవుతాను.చెప్పా కదా ఒక్కో సారి ఎగ్జాంస్ అయ్యాక క్రిస్మస్ సెలవలు ఉంటాయి తర్వాత సంక్రాంతికి ఒక నాలుగు రోజులు ఇస్తారు. లేదంటే ఖర్మ కాలి సరిగ్గా  జనవరి 2 నుంచి     పరీక్షలు మొదలయ్యి సంక్రాంతికి పది రోజులు సెలవలు ఉంటాయి.ఇలా జనవరి లో పరీక్షలుంటే మాత్రం జనవరి ఫస్ట్ని ఎంజాయ్ చేయలేము.ధనుర్మాసం రాగానే మా వీధిలో వాళ్ళు  వాకిళ్ళ ముందు చక్కని ముగ్గులు   పెట్టేవారు.వాళ్ళకేమో కొంచెం వాకిళ్ళు పెద్దగా ఉండడం చేత పేద్ద పేద్ద ముగ్గులేసేవారు. మాకేమో వాకిలి చిన్నది. మహా ఐతే ఓ 13 చుక్కలు పెట్టొచ్చు. ఈ వాకిలీ కాస్తా ఎదురింటి  వాళ్ళు ఇల్లు కట్టడం తో 13 చుక్కలదీ కాస్తా 9 చుక్కలది అయ్యిపొయింది. వాకిలి పెద్దదా చిన్నదా అని కాదు ముఖ్యం ముగ్గు వెయ్యడం అనుకునే మా పనమ్మాయి కనిపించీ కనిపించంకుండా ,తను వేసింది ముగ్గా అని హాశ్చర్యపడేలా కొన్ని రేఖా చిత్రాలను చిత్రించేది. మిగతా రోజులు పట్టించుకునేదాన్ని కాదు కాని ధనుర్స్మాసం ఐతే మాత్రం చూసేదాన్ని ఏం వేస్తోందా అని. అప్పుడు కూడా ఇంతే.

మిగతా వాకిళ్ళు చూస్తే నాకు కుళ్ళుగా ఉండేది.ఎంత పెద్ద  ముగ్గు వేసారో అని. కాబట్టి ఒక గట్టి నిర్ణయం తీసుకుని అమ్మ దగ్గరికెళ్ళి ఈ సారి డిసెంబర్ 31 కి మంచి ముగ్గు వెయ్యాలి. అందరి ముగ్గుల కన్నా మనదే బాగుండాలి అని వీర లెవెల్లో స్పీచ్ ఇచ్చా. అమ్మ చూస్తోంది ఏమైంది దీనికి అని. స్పీచ్ ఆపి   అమ్మా,కాబట్టి ఈ సారికి నువ్వు మంచి ముగ్గు వేసెయ్యి,నేనూ,చిన్ని మంచి రంగులేసేస్తాము అని చెప్పా. అమ్మకి అప్పుడుగానీ  బల్బ్ వెలగలేదు.నువ్వు ఇంత వీరావేశం చూపింది నా చేత వెయ్యించడానికా అని. అవును..నువ్వు ముగ్గులు బాగా వేస్తావు కదా…ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అని అరగంట బతిమాలిన తర్వాత సరే అన్నది. అమ్మ చాలా  బాగా ముగ్గులేస్తుంది.పేద్ద పేద్దవి…తన చిన్నప్పుడు వాళ్ళ వీధిలో తను వేసే ముగ్గుని చూడ్డానికి మిగతా ఇళ్ళ  వాళ్ళు వచ్చేవారంట.
సరే అమ్మని బతిమాలడం కాక మనమే ముగ్గు ఎందుకు నేర్చుకోకూడదు అనే ఒక బృహత్తర అవిడియా  వచ్చింది. అమ్మ దగ్గరకే వెళ్ళి నాకు ముగ్గు  నేర్పించు అని అడిగా. ఒక చిన్న ముగ్గు గీసి ఇచ్చింది.  తనేమో 2 నిమిషాల్లో వేసింది నాకేమో ఎంత సేపు ప్రయత్నించినా రాలేదు.వంకర టింకరగా వచ్చింది. ఇహ లాభం లేదని అమ్మనే ముగ్గు వేసేయ్యమన్నాను.

నేనూ చిన్ని వెళ్ళి  రంగు పొడి, చమికీ  పొడి పొట్లాలు   తెచ్చేసుకున్నాము.వాకిలి  చిమ్మి,నీళ్ళు చల్లి అమ్మ కోసం చూస్తున్నాము . తనొచ్చి ఒక 20  నిమిషల్లో ముగ్గు గీసేసింది. ఇక నేనూ చిన్ని కూర్చుని రంగులు అద్ది, చమికీ  పొడి వేసి ముగ్గుని అలంకరించాము.ఏదో మా తుత్తి కొద్దీ. కాని  పక్క వాకిళ్ళ వాళ్ళు పేద్ద పేద్ద ముగ్గులు పెట్టేస్తున్నారు …మాకేమో  కుళ్ళు కుళ్ళుగా ఉంది. ఇంత చిన్న వాకిలి ఉన్న ఇల్లు తీసుకున్న ఇంట్లో జనాలని అందరిని తిట్టుకున్నాము.కొంచెం సెపు తర్వాత చిన్నితో నేను పొనిలే చిన్ని ఏం చేస్తాము? మనం పెద్ద వాకిలి ఉన్న ఇంకో ఇల్లు తీసుకుందాము అని తనని,నన్ను నేను  సముదాయించుకున్నాము.  వెంటనే నాన్నగారి దగ్గరకి వెళ్ళి..ఇంత చిన్న వాకిలి ఉండే ఇల్లు మనకొద్దు.రేపే కొత్త ఇంటికి   మారిపోదాము.దానికి పెద్ద వాకిలి కూడా ఉండాలి అని చెప్పాము. దానికి సరే అని అన్నారు నవ్వుకుంటూ.

పక్కన ఫోటోలో ఉన్న ముగ్గుని చూసి అంత ముగ్గేసామనుకోకండీ..
ముందు ఆ ముగ్గు పట్టే మా వాకిలి దాని కంటే చిన్నదైపోయింది.. 😦

ఆ తర్వాత ముగ్గులు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. పేపర్ మీద బాగానే వచ్చినా, నేల మీద సొట్టలు గా వచ్చేవి.:(
ఇలా హోం వర్క్స్,ఎగ్జాంస్, హాలిడేస్,పండగలతో జీవితాన్ని ఎంజాయ్  చేస్తున్నాము.ఇంతలో ఒక ట్విస్ట్ వచ్చింది.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు…
నోరూరించే చక్రపొంగలి, కరకరలాడే మురుకులు, రుచికరమైన  అరిసెలు(రాస్తోంటే నోరూరుతోంది,మీకిష్టమైన వంటకాలు కూడా యాడ్ చేసేసుకోండి) మొదలగు పిండి వంటలతో కూడిన కమ్మని తెలుగు భోజన ప్రాప్తిరస్తు….

ఙ్ఞాపకాలు కొనసాగుతాయి

ప్రకటనలు

5 responses »

 1. ఙ్ఞాపకాలు బాగున్నాయ్ స్నిగ్ధగారు 🙂 నిజమే అవి అలా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి, ఇంతకీ ఇప్పుడైనా పెద్ద ముగ్గేయడం నేర్చుకున్నారా 🙂 హహ నేను చిన్నపుడు అంతే అప్పచెప్పేటప్పుడు ఇలా ఎగరగొట్టడం తెలీక నిజాయితీగా అప్పజెప్పాలని ప్రయత్నించి ట్యూషన్ లో చాలా రోజులు మొద్దబ్బాయిగా మిగిలిపోయాను.

 2. ఈ సారి పండక్కి ఇంటికి వెళ్ళ లేదనే ఒక అసంతృప్తి ఉంది ఇప్పటి వరకు..అన్ని జ్ఞాపకాలు గుర్తుకి తెచ్చేసారు
  థాంక్ యూ..
  వాకిలి కాన్సెప్ట్ బావుంది :ద
  ఇంతకీ ఆ ముగ్గు మీరే వేసారా..మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

 3. ఈ సారి పండక్కి ఇంటికి వెళ్ళ లేదనే ఒక అసంతృప్తి ఉంది ఇప్పటి వరకు..అన్ని జ్ఞాపకాలు గుర్తుకి తెచ్చేసారు
  థాంక్ యూ..
  వాకిలి కాన్సెప్ట్ బావుంది 😀
  ఇంతకీ ఆ ముగ్గు మీరే వేసారా..మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s