పండగ శుభాకాంక్షలు

సాధారణం

దీపావళి శుభాకాంక్షలు చెప్దామని టపా మొదలు పెట్టాను. కానీ ఏ  భాషలో చెప్పాలో తెలియక మకతిక పడుతున్నా.మకతిక ఎందుకు  మొదలయ్యిందంటే రెండు రోజుల ముందు తమిళ ఛానెలైన కలైఙ్ఞర్ లో దీపావళి ప్రత్యేక కార్యక్రమాల మాలిక ని చూపిస్తున్నారు.ఇదేంటి నేను  దీపావళి అనేసాను..వారి ప్రకారం అది దీప వొళి అయ్యితేనూ …దీప వొళి రోజున ఈ కార్యక్రమాలను ప్రసారం చేస్తారన్నమాట.వీరి ఛానెల్ వారికి మాత్రం దీప వొళి.మిగతా తమిళ ఛానెల్స్ వారు ఇంకా దీపావళినే  కొనసాగిస్తున్నారు వారి ప్రసారాల్లో.మకతిక వారి ప్రసారాల గురించి కాదు దీపావళి గురించి.

దీపావళి అనేది సంస్కృత పదమనీ కలైఙ్ఞర్  వారు దాన్ని అచ్చ తమిళం లోకి అనువదించారు.  ఏప్రిల్ 14న  జరుపుకునే తమిళ సంవత్సారాది ఆర్య సంస్కృతి నుండి దిగుమతి చేసుకున్నదని దాన్ని కూడా వారు  పొంగల్ రోజున’ తై తిరుణాల్ గా’ చేసుకుంటున్నారు.

తెలుగు వారికి కూడా ఇట్లాంటి పట్టింపులేమైనా ఉన్నాయా…
దీపావళి కూడా సంస్కృత పదమేనా?? మనకి అచ్చ తెలుగు పదం లేదా??
ఈ మకతిక వదిలేసి అందరికీ  దీపావళి శుభాకాంక్షలు..

ప్రకటనలు

6 responses »

 1. మీకు దీపావళి శుభాకాంక్షలు. నాకు తెలిసి దీపావళి సంస్కృత పదమేనండీ. వళి అంటే వరుస అని అర్థం. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. అయినా పేరుదేముందిలెండి చక్కగా కనులవిందుగా చేసుకొనే పండుగ ఇది. చిన్నా, పెద్దా అందరినీ అలరించే దివ్యకాంతుల పండుగ ఇది.

  • శ్రీవాసుకి గారు, చాన్నాళ్ళ తర్వాత కనిపించారు.ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అందరూ కన్నుల పండుగా చేసుకొనే పండుగేనండీ.
   కొంచెం ఉత్సుకత కొద్దీ అడిగాను దీపావళి కి తెలుగు పదమేదైనా ఉందా అని…

 2. ‘దీప వోళి’ అనగానే బెంగాళీ ప్రయోగమేమో అనుకున్నా….అరవ తంబీల టాలెంటా అది!!, బాగుంది భాషాభిమానం. చాలా చాలా ఆలస్యంగా దీపావళి చాలా చాలా ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు

  బెంగళూరులో ఉంటూ అక్కడ ఎలా పిలుస్తారో చెప్పనందుకు కన్నడిగుల తరఫున I hurted 😀

  • చారి గారు, అడపాదడపా మా బ్లాగ్ ని చూస్తున్నందుకు థాంకులు…శుభాకాంక్షలకి మరో థాంకు..
   దీప వోళి కాదండీ..దీప వొళి.. ఇట్టాంటి టాలెంట్లన్ని అరవ తంబిలకే సాధ్యం…మరేమనుకున్నారు వాళ్ళ భాషాభిమానం…ఇంకా కొన్ని ఝలక్ లు ఉన్నాయి అవి ఇంకో టపా లో రాస్తాను…ఇకపోతే కన్నడలో ఐతే దీపావళినే..అందుకే కన్నడలో చెప్పలేదు…:)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s