ఈ కారుకి వెనిలా అంటే అలెర్జి

సాధారణం

ఈ మధ్య నాకు వచ్చిన “వినియోగదారుడీ పిర్యాదుని తక్కువ అంచనా వెయ్యకండీ అది ఎంత చిన్నదైనా” అనే శీర్షిక తో వచ్చిన  ఈ-ఉత్తరమే ఈ టపా కి ప్రేరణ…

ఈ ఉత్తరం ఐ.టి సర్కిల్స్ లో ప్రాచుర్యమైందనే అనుకుంటున్నాను.

మేటర్ ఏంటా అని  చదివితే ఆసక్తికరం గా అనిపించింది.

ఒకసారి  “General Motors ” వారి ఉత్పాదైన ” Pontiac” మోడల్ కారుని వాడే ఒక వినియోగదారుడు ఆ “Division President ” కి రాసిన లేఖా సారాంశమిది.
“నేను ఇంతకు ముందే మీకు రాసిన లేఖకి స్పందన లేదు. అందుకు మిమ్మల్ని తప్పుపట్టడం లేదు.బహుశా నా లేఖ మీకు వెర్రిగా ఉందొచ్చు.కానీ ఇది నిజం.మా కుటుంబానికి రాత్రి భోజనాల తరువాత ఐస్ క్రీం తినే అలవాటు ఉంది. కుటుంబసభ్యుల అభిప్రాయం ప్రకారం  ప్రతి రాత్రి ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి.  ఐస్ క్రీం తీసుకోవడానికి కారుని తీసుకెళుతూ ఉంటాను.కానీ “Pontiac ” కారుని కొన్న తరువాత సమస్య మొదలయ్యింది. వెనిలా ఐస్ క్రీం కొన్న రోజు దుకాణం  నుంచి బయటకి వచ్చి కారుని స్టార్ట్ చేస్తే అవ్వలేదు.  మిగతా ఫ్లేవర్స్ కొన్న రోజు మాములుగానే స్టార్ట్ అవుతోంది.ఒక్క వెనిలా కొన్న రోజే ఇలా అవుతొంది.నాకెందుకిలా జరుగుతుందో అర్ధం కావడం లేదు.ఇలా జరగడానికి ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా? ఉంటే నాకు తెలియజేయగలరు”.

ఆ  “President “ముందు నమ్మలేకపొయినా తన ఇంజినీర్ని విషయం ఏంటో కనుక్కొమని పంపాడు. ఆ ఇంజినీర్ ఇతన్ని కలసి రాత్రి భోజనలయ్యాక  ఐస్ క్రీం దుకాణం కి కారులో వెళ్లారు. ఆ రోజు వెనిలా ఐస్ క్రీం కొన్నారు.తిరిగి వచ్చి కార్ స్టార్ట్ చేస్తే అవ్వలేదు.మరో మూడు రోజులు ఇదే తంతు కొనసాగింది.వెనిలా కాక  ఏ ఫ్లేవర్ కొన్నా కార్ స్టార్ట్ అయ్యేది.ఇంజినీర్ కి కూడా విషయం అర్ధం కాలేదు.

మళ్లి కొన్ని రోజులు ఇదే పరిశీలనని సాగించి నోట్స్ తయారు చేసుకున్నాడు.నోట్స్ ని పరిశీలిస్తుండగా అతనికి అర్ధమయ్యిన విషయం వెనిలా కొనేటప్పుడు తక్కువ సమయం పడుతోంది.ఎందుకంటే వెనిలా పాపులర్ బ్రాండ్ కావడం చేత దుకాణం మొదట్లోనే ఉండేది.మిగాతావి కొంచం వెనుకల ఉండేది.  దీనికి మన సమస్యకి ఏమైనా లంకె ఉందా అని ఆలోచిస్తుండగా వెంటనే అతనికి సమాధానం స్పురించింది.యురేకా!! ఐస్ క్రీం కాదు సమస్య, అసలు సమస్య సమయమూ అని. అతను తన పై అధికారైన   President కి సమాధానం పంపాడు.ఏంటంటే “Vapour Lock ” వలనే సమస్య వస్తోంది అని.అది కారులో ప్రతి రాత్రి జరుగుతోంది.మిగతా ఫ్లేవర్ ఐస్ క్రీం కొనేప్పుడు సమయం ఎక్కువ తీసుకోవడం చేత ఇంజీన్ మళ్లి స్టార్ట్ అవ్వడానికి అనుగుణంగా త్వరగా చల్లబడేది.కాని వెనిలా తీసుకునేప్పుడు త్వరగా చల్లబడడం లేదు అని.

తమ ఉత్పత్తిలోని ఈ పొరపాటుని సరిదిద్దుకున్నారు.ఈ సమస్యని తమ ముందుంచిన వినియోగదారుడిని అభినందించి, అతని పాత కారుని కొత్త కారుతో రిప్లేస్ చేశారు.
ఒక్కోసారి సిల్లీ గా అనిపించేవి కూడా పెద్ద సమస్యలని పరిష్కరిస్తాయి కదా…

సమస్యని మనం చూసే థృక్పథం లో ఉంటుంది.ఈ సంఘటన ద్వారా ప్రెసిడెంట్, ఇంజినీర్ ఇద్దరూ వినియోగదారుడి పట్ల తమకి ఉన్న సేవాతత్పరత,నిబద్దత,అంకితభావాన్ని చాటుకున్నారు.

ఈ సంఘటన గురించి “General Motors ” అధికారికంగా  ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ,కథ మంచి సందేశాన్ని అందిస్తోంది కదూ.

“Pontiac”  కారు విశేషాలు మరొక టపాలో…

ప్రకటనలు

4 responses »

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s