రాజయోగం

సాధారణం

చిన్నప్పుడు ఎప్పుడో చదివిన ఈ కథని చెప్పాలనిపించిపింది.నాకు ఈ కథని తలచుకున్నప్పుడల్లా  ఒక విధమైన స్పూర్తినిస్తుంది.

నేను ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదివే రోజులు.క్లాస్సులయ్యాక స్నేహితులందరం టీ కొట్టు దగ్గర ఉన్నాము.కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉన్నాము.ఇంతలో అక్కడకి  ఒక జ్యోతిష్కుడు వచ్చాడు.మాకు  పెద్దగా జ్యోతిష్యం పై నమ్మకం లేకపొయినా  టైం పాస్ కోసం అతని దగ్గరకి వెళ్ళాము.ఒక్కొక్కరి చెయ్యి చూస్తూ అతను వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తున్నాడు.నా వంతు రానే వచ్చింది.నా చెయ్యి చూసి “నీకు రాజయోగం పడుతుంది” అని అన్నాడు. నేను పెద్దగా పట్టించుకోలేదు.నవ్వి ఊరుకున్నాను.అతనికి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్ళి పోయాము.

ఈ లోపల  పరీక్షలవ్వడం,ఇంతలో  క్యాంపస్ నియాకమాలలో ఉద్యోగం రావడం చకచకా జరిగిపొయాయి.స్నేహితులలో మొదటగా నాకే ఉద్యోగం వచ్చింది.కాకపొతే వేరే రాష్ట్రం లో పోస్టింగ్ వచ్చింది. అమ్మానాన్నలను,స్నేహితులను వదిలి వెళ్ళాలన్న దిగులు,బెంగ అన్నీ భావాలు ఒకే సారి కలిగాయి.ఉద్యోగం లో చేరిపొయాను.

మా కార్యాలయం కొంచెం ఊరికి దూరంగా ఉంటుంది.నాలా కొత్తగా చేరిన వారు కొంత మంది మిత్రులయ్యారు.అందరం కలిసి ఊర్లో ఇల్లు తీసుకున్నాము.అందరం కలిసి పనులు చేసుకోవాలని అనుకున్నాము.పనులు చెయ్యడానికి ఒప్పుకున్నాను కాని నాకెమో ఒక్క పని రాదు.ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ సకలం అమర్చేది.నాన్నగారు అడిగిన వెంటనే ఏది కావాలన్నా తెచ్చేవాళ్ళు.

ఆఫీస్ కి వెళ్ళి రావడం ,ఇంట్లో పనులతోటి కాలం గడచిపోయేది.బాగా అలసిపొయే వాణ్ణి.కొన్ని రోజులు అయ్యాక పనులు చేసుకోవడం అలవాటయ్యింది.ఇంతలో జ్యోతిష్కుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.రాజయోగం పడుతుంది అని అన్నాడు కాని అలా ఏమి జరగకపొగా అందరికి నేను పనులు చేస్తున్నాను అని.పైగా ఇంటికి వెళ్ళానే బెంగ కలిగింది.కొన్ని రోజులు సెలవులు రావడంతో  మా ఇంటికి వెళ్ళాను.అదే టీ కొట్టు దగ్గర  స్నేహితులందరం కలిశాము.అదే జ్యోతిష్కుడు అక్కడ ఉన్నాడు.నేను ఆయన్ని గుర్తుపట్టి వెళ్ళి కలిశాను.అతనూ నన్ను గుర్తు పట్టాడు.నేను ఆయనతో నాకెమో రాజయోగం పడుతుందని మీరు చెప్పారు.అలాంటిదేమి జరగలేదు అని చెప్పాను.ఆయన నన్ను ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు అని అడిగారు. నేను ఉద్యోగం వచ్చిన విషయం చెప్పాను.అక్కడెలా కష్టపడుతున్నానో చెప్పాను.వెంటనే ఆయన నవ్వి ఇలా అన్నారు” బాబూ,నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు.ఇన్ని రోజులు నువ్వు మీ నాన్నగారి పొషణలో ఉన్నావు.ఇప్పుడు నువ్వు నీ స్వంత కాళ్ళపై నిలబడి ఉన్నావు.నీ శరీరాన్ని నువ్వే పొషించుకుంటున్నావు.నీ పనులు నువ్వే చేసుకుంటున్నావు. నలుగురికి చేతనైన సాయం చేసే స్థితి లో ఉన్నావు.ఇదేనయ్యా అసలైన రాజయోగం అంటే”.

8 responses »

  1. రాజయోగమంటే పెద్దమేడ, ఏనుగు అంబారీ అని ఊహించుకున్నారన్నమాట. బాగుంది. మా నాన్నగార్కి ఒక జ్యోతిష్యుడు వ్యాపారం చేస్తావని చెప్పాడు. తర్వాత ఆర్టీసి లో కండక్టర్ గా ఉద్యోగం చేసారు. వ్యాపారం మాటేమిటి అని అడిగితే ప్రయాణీకులకు టికెట్లు అమ్మి డబ్బులు తీసుకొంటున్నా కదా అదే వ్యాపారం అన్నారు. ఏదైనా మనం అనుకోవడాన్ని బట్టి ఉంటుంది.

    • రాజయోగం అంటే అందరం ఒక రేంజ్లో ఊహించుకుంటాము కదండీ,నేను చదివిన కథలో కూడా హీరో ఆ భ్రమలోనే ఉంటాడన్నమాట..

      కానీ చివరగా ఈ కథారచయిత చాలా బాగా అర్థం చెప్పారు రాజయోగానికి(కథారచయిత అంటే నన్ను అనుకునేరు…మూలరచయిత అని అర్థం చేసుకోవాలని నా మనవి).

      మీరన్నట్లు మనం అనుకోవడంలోనే ఉంది అంతా…

      వ్యాఖ్య పంపినందుకు ధన్యవాదములు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s