The Kite Runner

సాధారణం

బ్లాగ్ మొదలుపెట్టి చాలా రోజులయ్యింది.ఇన్ని రోజులు ఏమి రాయాలో తెలియలేదు. ఎట్టకేలకు  నా బ్లాగ్ కి మంచి రోజులు వచ్చాయనుకుంటాను.ఒక మంచి టపా రాసే అదృష్టం కలిగింది.

ఈ టపా లో ఇటీవలి కాలం లో నేను  చదివిన ఆంగ్ల నవల పరిచయం చెయ్యాలనిపించింది.

నేను చదివిన నవల పేరు “The Kite Runner”.రాసినది “ఖలీద్ హొస్సెని”.ఇది రచయిత తొలి నవల.2003 లో ప్రచురింపబడినది.ఈ నవల ఆధారంగా ఆంగ్ల మరియు పర్షియన్ భాషలలో చిత్రాన్ని  నిర్మించారు.ఈ చిత్రం “గోల్దెన్ గ్లోబ్” మరియు “అస్కార్” అవార్డ్స్ కి నామినేట్  అయ్యింది.

రచయిత గురించి చెప్పాలంటే..ఇతను అఫ్ఘాన్ దేశస్థుడు.1980ల ప్రాంతంలో అఫ్ఘాన్ పై రష్యా జరిపిన దాడులలో  అమెరికా రాజకీయ శరణు పొందిన వాడు.ప్రస్తుత నివాసం అమెరికాలో.అక్కడే వైద్యుడి  గా సేవలు అందిస్తున్నాడు. 

ఈ నవల అమీర్ అనే అబ్బాయి కథ.అతనే మనకీ కథని వివరిస్తున్నట్లు ఉంటుంది.అమీర్ కాబుల్ లోని ఒక ధనిక నేపథ్యం ఉన్న అబ్బాయి.అమీర్ తన బాల్యస్మృతులతో  పాటు  బాల్యమిత్రుడైన హస్సన్ ని పరిచయం చేస్తాడు. హస్సన్ అతని ఇంట్లో  పనిచేసే అలీ అబ్బాయి. ఇద్దరూ తల్లి ప్రేమకి నోచుకోని వారే.అమీర్ తండ్రి అమీర్ని అభిమానించిన విధంగానే హస్సన్ ని అభిమానిస్తాడు. అమీర్ 1975లలో ని అఫ్ఘాన్ అందాలను,  అక్కడి ప్రజల జీవన గమనాన్ని,వారు జరుపుకునే  పండుగలను ,వినోదాలను   వివరిస్తాడు.  వాళ్ళ  ప్రాంతం లో   ముఖ్యం గా  పేరోందిన  గాలిపటం పందాలను గురించి వివరిస్తాడు. ఈ కథాక్రమం లోనే అఫ్ఘాన్ తెగలైన  పష్తూన్లు మరియు  హజారాల గురించి చెప్తాడు. అమీర్,అమీర్  తండ్రి,అలీ,హస్సన్ మరియు అమీర్ తండ్రి స్నేహితుడు రహిం ఖాన్ మధ్య అనుబంధాన్ని  చెప్తాడు.కథలు రాయడం  లో అమీర్ అభిరుచిని గమనించిన రహీం ఖాన్ అతన్ని ప్రోత్సహిస్తాడు.  మధ్యలో కొన్ని సంఘటనల   వలన అలీ మరియు హస్సన్ ఇల్లు వొదిలి వెళ్ళిపొతారు.ఇంతలో రష్యా దాడుల వల్ల అమీర్,అతని తండ్రి పాకిస్తాన్ మీదుగా అమెరికాలో శరణార్థులుగా అడుగుపెడ్తారు. వారి లాగే శరణార్థులుగా ఉన్న మరికొంతమందిని కలుస్తారు.అఫ్ఘాన్ లో విలాస జీవితాన్ని గడిపిన  వారు మళ్ళి కొత్త జీవితాన్ని మొదలుపెడ్తారు. ఈ క్రమంలో అమీర్ తన చదువుని పూర్తి చేసి తనలాగే అఫ్ఘన్ నుంచి  శరణార్థి కుటుంబం గా వచ్చిన  సురయ్యని పెళ్ళి చేసుకుంతాడు.ఇంతలో అమీర్ తండ్రి మరణిస్తాడు. అమీర్,సురయ్య సంతోషం గా ఉన్నా,పిల్లలు కలగరనే చేదు నిజం వారిని బాధిస్తుంది.

పదిహేను సంవత్సరాల తరువాత తన తండ్రి మిత్రుడైన  రహిం ఖాన్ నుంచి కబురు వస్తుంది కలవమని.రహిం ద్వారా  అమీర్ కి ఒక చేదు నిజం తెలుస్తుంది.తన ఆఖరి కోరిక ప్రకారం అమీర్ మళ్ళీ తాలిబన్ల పాలన లో ఉన్న అఫ్ఘన్ లోకి అడుగు పెట్టాల్సి వస్తుంది.

నిజం చెప్పాలంటే ఇది  రచయిత తొలి నవల అని అనిపించదు. చాలా అనుభవశాలి గా రాసారు. కథని పట్టుగా నడిపారు.నవల పూర్తి చేశాక చాలా  ఎమోషనల్ గా అనిపించింది. అఫ్ఘానిస్తాన్ గురించి,అక్కడి  ప్రజల గురించి తెలిసింది.వారు ఉన్న పరిస్థితి కి కొంచం  బాధ వేసింది.  

ఏది  ఏమైనా  ఒక మంచి నవల చదివామన్న తృప్తిని  మిగిల్చింది.
చదివి చూడండి!!!!!

ప్రకటనలు

6 responses »

    • మొదటగా వ్యాఖ్య పంపినందుకు ధన్యవాదములు.చేతన్ భగత్ మొదటి నవలకి తెలుగు అనువాదం ఉన్నట్లు చదివానండి.మిగతా వాటికి ఉన్నాయో లేవో కనుక్కోవాలి.” The Kite Runner” కి తెలుగు అనువాదం లేదనే అనుకుంటున్నాను.ఒక వేళ ఉందని తెలిస్తే మీకు తెలియజేస్తాను.తప్పకుండా మంచి తెలుగు నవలలని పరిచయం చేస్తాను.

    • తప్పకుండా పరిచయం చెస్తాను.మీరడిగిన లింక్స్ కొంచెం వెతకాలండీ.
      దానికి కొంచెం సమయం కావాలి.
      అభిప్రాయముని పంపినందుకు ధన్యవాదములు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s