మనసులో మెదిలే భావాలకు అక్షర రూపం ఇవ్వడం కోసం చేసిన చిన్న ప్రయత్నమే ఈ బ్లాగ్.మన మాతృభాష లో ఎన్ని కబుర్లైనా అలవోకగా చెప్పుకొవచ్చు.తేనెలూరు మన తెలుగులో ఈ కబుర్లు పంచుకోవాలన్నది నా అభిలాష. –ఇలా చెప్పడం Routine kadaa..
ఎప్పుడో బ్లాగ్స్ గురించి విన్నాను.దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు.ఒక దివ్య ముహూర్తాన కొన్ని తెలుగు బ్లాగ్స్ ని చూసాను.వెంటనే ఙ్ఞానోదయం కలిగింది. ఇంతమంది భాషా సేవలో తరిస్తున్నారు,నేను కూడా ఎందుకు తరించకూడదు అన్న ఆలోచన వచ్చింది.దాని ఫలితమే ఈ బ్లాగ్.